నాగ చైతన్య తాజాగా 'యుద్ధం శరణం' చిత్రంతో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి షోకే మిక్స్డ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్ లో రన్ అవుతుంది. నాగ చైతన్య కెరీర్ మొత్తంగా పరిశీలిస్తే నాగ చైతన్య చేసిన సినిమాల్లో అతను చేసిన మాస్ సినిమా లేవీ చైతూకి అస్సలు కలిసి రాలేదు. అతని మొదటి సినిమా 'జోష్' కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలై బోల్తా కొట్టింది. పోనిలే మొదటి సినిమా కదా అనుకున్నారు. ఆ తర్వాత ఒకటి రెండు ప్రేమ కథా చిత్రాలతో హిట్ కొట్టిన చైతు మళ్లీ యాక్షన్ అంటూ 'దడ, ఆటోనగర్ సూర్య, బెజవాడ' చేశాడు. ఆ సినిమాలు చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అయ్యాయి.
అయితే నాగ చైతన్య తన రెండో సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వ,లో 'ఏమాయ చేశావే' వంటి ప్రేమ కథతో మంచి హిట్ కొట్టాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో '100 % లవ్' చేసి సూపర్ హిట్ కొట్టాడు. అలాగే 'ఒక లైలా కోసం' చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఆమధ్యన 'మనం' వంటి కుటుంబ కథా చిత్రంతో మెప్పించాడు. మళ్లీ 'ప్రేమమ్' అనే ప్రేమ కథతో హిట్ కొట్టిన చైతు 'రారండోయ్ వేడుక చూద్దం'తో మళ్లీ హిట్ కొట్టాడు. కానీ మద్యలో 'దోచేయ్' వంటి యాక్షన్ సినిమాలతో ప్లాప్ తెచ్చుకున్నప్పటికీ చైతూ యాక్షన్ జోనర్ ని వదిలిపెట్టడం లేదు.
అసలు చైతన్య కి మాస్ కలిసిరాదనే విషయం అంతా క్లియర్ కట్ గా అర్ధమైనప్పటికీ చైతు మాత్రం మాస్ మాస్ అంటూ ఇంకా ఎగబడుతూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు కృష్ణ మరిముత్తు డైరెక్షన్ లో 'యుద్ధం శరణం' అంటూ మళ్లీ యాక్షన్ జోనర్ కే ఓటేశాడు. మళ్లీ ఏం జరిగింది ఈ చిత్రం కూడా ప్లాప్ టాక్ తెచ్చేసుకుని కలెక్షన్స్ వీక్ అవడమే కాదు చైతు పెళ్ళికి భారీ డిజాస్టర్ తో స్వాగతం పలుకుతున్నాడంటూ కామెంట్స్ పడుతున్నాయ్. మరి నాగ చైతన్య ఇలా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చెయ్యడం మాత్రం బాగోలేదంటున్నారు. చూద్దాం ఈదెబ్బకి చైతు మారుతాడా లేకుంటే మళ్లీ మాస్ అంటూ జపం మొదలెడతాడో చూద్దాం.