Advertisement

వైసీపీ లో మరో తేడా సింగ్..!

Sun 10th Sep 2017 05:24 PM
kodali nani,balakrishna,ysrcp,chief minister post,chandrababu naidu,ys jagan,harish rao  వైసీపీ లో మరో తేడా సింగ్..!
Kodali Nani Over Confidence on His Victory వైసీపీ లో మరో తేడా సింగ్..!
Advertisement

వైసీపీలో ఒక్కొక్కరి తీరు ఒక్కోరకంగా ఉంటోంది. కాబోయే సీఎంను నేనే.. అన్నట్లుగా ప్రతిఒక్కరు ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్నందరినీ బాగా గుర్తుపెట్టుకుంటాను. నేను సీఎం అవ్వగానే మీ అంతుచూస్తానని స్వయాన ప్రతిపక్ష నేత జగన్‌ అధికారులను బెదిరిస్తున్నాడు. తాను సీఎం అయిన వెంటనే చంద్రబాబు గుడ్డలు ఊడదీస్తా. ఆయనను ఉరికంభం ఎక్కిస్తా.. నడిరోడ్డులో కాల్చేస్తా అనే దోరణిలో మాట్లాడుతున్నాడు. మరోవైపు వైసీపీ నేతలందరి పరిస్థితి అలాగే ఉంది. వారు తాము అధికారంలోకి వచ్చేసినట్లే భ్రమిస్తూ నానా మాటల రాద్దాంతాలు క్రియేట్‌ చేస్తున్నారు. 

'మనీ' చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఒకటి ఉంటుంది. అందులో ఆయన తాను మెగాస్టార్‌ని, హీరోని కావాలని, కానీ తాను సినిమా హీరోనై పోతే తమ స్థానాలు గల్లంతవుతాయోమోనని స్టార్‌ హీరోలంతా కలిసి తనను తొక్కేస్తున్నారని భావిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ వ్యాధే జగన్‌కి, ఆయన పార్టీ వారికి పట్టినట్లు స్పష్టంగా వారి మాటలను బట్టి అర్ధమవుతోంది. జగన్‌ తానే సీఎం అనుకుంటున్నాడు. ఆయన కలలో కూడా తాను సీఎం కాదు అనే వాస్తవాన్ని భరించలేకపోతున్నాడు. ఇక ఆయన వచ్చే ఎన్నికలల్లో తన పార్టీ గెలిచి అధికారం సొంతం చేసుకున్నా తాను అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్తానేమో అనే ఆలోచన కూడా రానివ్వడం లేదు. జగన్‌ మానసిక పరిస్థితి ఏమిటంటే ఆయన తాను సీఎంగా కాకుండా కనీసం తన సోదరి షర్మిలా, లేదా తన తల్లి విజయమ్మలు కూడా ముఖ్యమంత్రులు అవుతారనే మాటలే భరించలేని స్థితిలో ఉన్నాడు. 

ఇలాంటి సందర్భంలో మొన్నటిదాకా జూనియర్‌ ఎన్టీఆర్‌కి నమ్మకస్తుడిగా ఉండి వైసీపీలోకి వచ్చిన కొడాలి నాని మరో వింత వ్యాఖ్య చేశాడు. కుప్పంలో చంద్రబాబుని, పులివెందులలో జగన్‌ని, సిద్దిపేటలో హరీష్‌రావుని, గుడివాడలో తనని ఎన్నేళ్లయినా, ఎన్నిసార్లయినా ఎవ్వరూ ఓడించలేరని వ్యాఖ్యలు చేశాడు. బహుశా ఈ వార్తలు ఇప్పటికే జగన్‌ చెవిన పడుంటే ఆయన ముందు ఎల్‌కేజీ స్టూడెంట్‌లా గోడకుర్చి వేసుకుని కొడాలి నాని ఉన్నా ఆశ్చర్యం లేదు. ఈ మాటలు జగన్‌కి అసలు గిట్టవు. మిగిలిన చంద్రబాబు, జగన్‌, హరీష్‌రావుల విషయం సరే.. మద్యలో తన పేరు కొడాలి నాని ఎందుకు చెప్పాడు? అనేది అంతటా చర్చ జరుగుతోంది. 

వైసీపీ గెలిచినా జగన్‌ జైలుకి వెళ్తే ఆయన ప్లేస్‌ తనదేనని కొడాలి భావిస్తున్నాడేమో? ఇక మరోపక్క వచ్చే ఎన్నికలలో తనకు హిందూపూర్‌లో ఎదురుగాలి తప్పదని భావిస్తున్న బాలయ్య వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడని అంటున్నారు. అదే జరిగితే ఒకే సీటుకి ఇద్దరు తేడా సింగ్ లలో ఎవరిని ఎంచుకోవాలో గుడివాడ ప్రజలకు అర్ధం కాని పరిస్థితి ఏర్పడటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 

Kodali Nani Over Confidence on His Victory:

Kodali Nani , the CM Candidate of YSR Congress Party

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement