కత్తి మహేష్.. సాదారణంగా కొందరు సినీ ప్రేమికులకు మాత్రమే ఆయన పేరు ఓ క్రిటిక్‌గా తెలుసు. కానీ పవన్‌కళ్యాణ్‌పై వ్యాఖ్యలు, బిగ్‌బాస్ హౌస్‌లో పార్టిసిపెంట్ చేయడం ద్వారా ఆయనో సెలబ్రిటీ అయిపోయాడు. కాగా గతంలో కత్తి మహేష్ వైయస్సార్‌సీపీతో పాటు పలు పార్టీల ప్రకటనలలో నటించి ఉన్నాడు. దానిపై ఆయన్ను ప్రశ్నిస్తే తాను రెమ్యూనరేషన్ తీసుకుని నటించే నటునిగా, ఎవరిపార్టీ తరపున అయినా నటిస్తానని చెప్పాడు. ఇక ఆయన బిగ్ బాస్‌లోకి ఎంట్రీ, తదనంతర పరిణామాలపై ఇప్పుడు ఆయనపై వాడివేడి చర్చ జరుగుతోంది.
ఇటీవల సోషల్‌మీడియాలో వైసీపీ మద్దతుదారులు, తెలుగుదేశం పార్టీని, దాని నాయకులైన చంద్రబాబునాయుడు, నారా లోకేష్ వంటి వారిపై మితిమీరిన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ కూడా ఇంతకాలం వెనుకబడి పోయిన సోషల్‌మీడియాను ఇప్పుడు విస్తృతంగా వాడుకుంటోంది. ఇదే సమయంలో కత్తి మహేష్ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ, వారు చేయలేని పనిని తాను చేసి, తెలుగుదేశంకు కాస్త పక్షపాతిగా ఉన్న పవన్‌కళ్యాణ్‌పై కావాలనే కాలు దువ్వుతున్నాడనే అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి.
కత్తి మహేష్ కిందటి ఎన్నికల్లో తాను వైసీపీ తరపున ప్రచారం చేశానని ఒప్పుకున్నాడు. అలాంటి నేపధ్యంలో జగన్‌కి తెరవెనుక సాయం చేయదలుచుకుని ఆయన ఇలాంటి కామెంట్లు పెడుతూ.. పవన్ ఇమేజ్‌ని కావాలనే డ్యామేజ్ చేస్తున్నాడనే అనుమానాలు కూడా పలువురిలో ఉన్నాయి. మహేష్ కత్తి ఓ వ్యక్తిగా ఏ పార్టీనైనా సపోర్ట్ చేయవచ్చు. అది అతని ఇష్టం. కానీ కేవలం రాజకీయలబ్ది కోసమే, ఓ పార్టీని కొమ్ముగాస్తూ వేరే పార్టీని కావాలని చులకన చేస్తూ పైకి ఎదగాలని, ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా శవాలపై తన రాజకీయ పునాదిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే మాత్రం అది అభ్యంతరకరం.
వాక్ స్వాతంత్య్రంతో పాటు దేశంలో ఎన్నో స్వేచ్చలున్నప్పటికీ వాటికి రాజ్యాంగంలోనే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇతరుల మనోభావాలను దెబ్బతీయనంత వరకు మాత్రమే ఎవరికైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎదుటి వారి ముక్కును తాకనంతవరకు మాత్రమే దేనికైనా లిమిట్ ఉంటుంది. అంతేగానీ మరి ఓవర్‌గా చేస్తే మాత్రం కొత్త పాపులారిటీ దేవుడికెరుగు.. ఉన్న పాపులారీటిని కూడా ఆయన పోగొట్టుకోవడం ఖాయం.
తాజాగా పవన్ బెంగుళూరులో జరిగిన మహిళా జర్నలిస్ గౌరీ లంకేష్ హత్యపై స్పందించాడు. దీనిని కూడా కత్తి మహేష్ తప్పు పట్టాడు. కామన్‌సెన్స్ లేకుండా ట్వీట్ చేశాడని పవన్‌పై అవాక్కులు చవాక్కులు పేలాడు. అసలు గౌరీ లంకేష్ మరణంపై కత్తి మహేష్ స్పందన ఏంటి? జగన్ స్పందనేంటి? అనేది ముందు తెలిపి తర్వాత పవన్ స్పందననను తప్పు పడితే సమంజసంగా ఉంటుంది. అసలుగౌరీ లంకేష్ ఎవరో? ఆమె భావజాలం, ఆమె పంథా ఏమిటో కూడా తెలియని ఈ కత్తి మహేష్, జగన్ వంటి కుహనా మేధావుల స్పందన ఏమిటో ముందుగా చెప్పాల్సివుంటుంది....!