ఆగష్టు 11 న పోటీ పడ్డ 'నేనే రాజు నేనే మంత్రి, లై, జయ జానకీ నాయక' సినిమాల్లో సేఫ్ అయినది.... నిర్మాతలకు కాస్త లాభాలు తెచ్చిపెట్టింది కేవలం రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' మాత్రమే అంట. మిగతా రెండు సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలే చూపించాయంట. నితిన్ 'లై' సినిమా కేవలం 10 కోట్లు మాత్రమే రాబట్టి అతి పెద్ద డిజాస్టర్ గా నిలవగా.... బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'జయ జానకి నాయక' చిత్రం కూడా మొత్తం 36.25 కోట్ల గ్రాస్ ను రాబట్టి.. 21.45 కోట్ల రూపాయల షేర్స్ ని అందుకుని నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందని టాక్ బయటకి వచ్చింది.
ఆ మద్యన 'జయ జానకి నాయక' కలెక్షన్స్ లో దూసుకుపోతోందని.... నిర్మాతలకు కొంత లాభాన్ని కూడా ఇచ్చిందనే ప్రచారం జరిగింది. పోటీ పడ్డ రెండు సినిమాలతో 'జయ జనకి నాయకే' అత్యధిక వసూళ్లు సాధించిందని మాములుగా ప్రచారం జరగాలా.... అయితే సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయిందంటూ ఇపుడు కొత్తగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే 'జయ జానకి నాయక' సినిమా హీరో మీదకన్నా ఎక్కువగా దర్శకుడు మీద నమ్మకంతోనే నిర్మాతలు ఈ సినిమాకి హై బడ్జెట్ పెట్టారన్నది జగమెరిగిన సత్యం.
ఎప్పుడైనా హీరో మర్కెట్ ని బట్టే నిర్మాతలు సినిమాలు నిర్మిస్తారు.... ఏదో రాజమౌళి వంటి దర్శకులు ఉన్నప్పుడు మాత్రమే హీరో కన్నా.. దర్శకుడు మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటుంటారు నిర్మాతలు. అయితే ఇక్కడ మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ కన్నా నిర్మాతలు బోయపాటి శ్రీను ని నమ్మే 'జయ జానకి నాయక'కి భారీ బడ్జెట్ ఎక్కించారు. మరి నిర్మాతల అతినమ్మకమే ఇప్పుడు 'జయ జానకి నాయక' డిజాస్టర్ కి కారణమంటున్నారు. కేవలం హీరో మార్కెట్ విలువని అంచనా వెయ్యకుండా ఈ సినిమాని నిర్మించడం వలెనే నిర్మాతలు ఇప్పుడు నష్టాల్లో కూరుకు పోవాల్సి వచ్చిందనే టాక్ మాత్రం ఫిలింనగర్ సర్కిల్స్ లో గట్టిగా వినబడుతుంది.