అక్టోబర్ 6 న గోవా లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మధ్యన పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య - సమంత ల రిసెప్షన్ మాత్రం గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడట నాగార్జున. పెళ్లి కి సంబందించిన నిర్ణయాన్ని చైతు - సామ్ లకే వదిలేసినా నాగార్జున ఇప్పుడు వాళ్ళ రిసెప్షన్ ని మాత్రం అంగరంగ వైభవంగా చెయ్యాలని నిర్ణయించుకోవడమేకాదు... అందుకు తగిన ఏర్పాట్లు కూడా మొదలెట్టేశాడట. గోవాలో లో అక్టోబర్ 6 వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగినా.. 7 న మాత్రం క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం చై - సామ్ ల వివాహం జరగనుందని తెలిసిన విషయమే.
ఇక పెళ్లి కి అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతుండగా.. హైదరాబాద్ లో అక్టోబర్ 10 న నాగ్ ఇచ్చే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కి బడా రాజకీయ నేతలతో పాటు, సినిమా పరిశ్రమ పెద్దలు, సన్నిహితులు, క్రీడారంగ అతిధులు, వ్యాపార భాగస్వాములు...ఇలా పెద్ద సంఖ్యలో హాజరవుతారని సమాచారం అందుతుంది. ఇకపోతే నాగార్జున వీరందరిని పర్సనల్ గా కలిసి మరి నాగ చైతన్య - సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానిస్తున్నాడట. మరి పెళ్లి చూడలేకపోతున్నామని బాధపడుతున్న అక్కినేని అభిమానులకు ఈ నాగ్ నిర్ణయంతో ఫుల్ ఖుషి అయిపోవచ్చు.