పవన్‌కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందిన 'పులి' అలియాస్ 'కొమరం పులి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ నిఖిషా పటేల్. ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈమెకు మరలా సరైన అవకాశాలు లభించలేదు. ఆ తర్వాత ఏవో చిన్నా చితకా పాత్రలు చేస్తూ వస్తోంది. చివరకు సినిమాలలో వేషాలు అసలు లేకపోవడంతో పలు మేగజైన్లకు హాట్ హాట్ ఫొటోషూట్స్ ఇస్తూ వస్తోంది. ఆ విధంగానైనా హీరోలను, దర్శకనిర్మాతలకు ఆకట్టుకుందామని ఆమె చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. సినిమా అవకాశాలేమీ రాలేదు.
దీంతో ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సంచలనాలు క్రియేట్ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా స్మిమ్మింగ్‌ఫూల్, బీచ్‌ల వద్ద తీయించుకున్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ విధంగా తన ఉద్దేశ్యాన్ని దర్శకనిర్మాతలకు తెలియజేస్తోంది. అంతకు ముందు బ్లాక్‌బికినీలు ప్రదర్శించినా, వైట్ బ్యాక్‌లెస్ ఫోటోలను పోస్ట్ చేసినా ఎవ్వరూ నిఖిషాను పట్టించుకోలేదు. పోనీ ఈ స్విమ్‌సూట్‌లు వెలుగులోకి తెస్తాయా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తానికి నికేషా ఈ స్మిమ్మింగ్ ఫోటోల ద్వారా చివరి అస్త్రాన్ని సంధించిందని చెప్పాలి. మొత్తానికి అవకాశాలు లేకపోతే అంగాంగప్రదర్శనే చివరి మంత్రమని నిఖిషా భావిస్తోంది కాబోలు....!