Advertisementt

'జై లవ కుశ' : కళ్యాణ్ రామ్ కి కోట్లే కోట్లు!

Sat 09th Sep 2017 02:26 PM
jai lava kusa,jai lava kusa pre release business,kalyan ram,jr ntr,bobby  'జై లవ కుశ' : కళ్యాణ్ రామ్ కి కోట్లే కోట్లు!
Jai Lava Kusa Pre Release Business Sensation 'జై లవ కుశ' : కళ్యాణ్ రామ్ కి కోట్లే కోట్లు!
Advertisement
Ads by CJ

'జై లవ కుశ' విడుదలకు దగ్గరయ్యే కొలదీ ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో అందరికి తీవ్ర ఉత్కంఠ పెరిగిపోతుంది. అందులోను 'జై లవ కుశ' పబ్లిసిటీ కార్యక్రమాలు పీక్ లో ఉన్నాయి. ఇప్పటికే 'జై లవ కుశ' పాటలు మార్కెట్ లో హల్చల్ చేస్తుండగా... మరో రెండు రోజుల్లో 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ కూడా రాబోతుంది. ఇప్పటికే జై, లవ, కుశ టీజర్ లు యూట్యూబ్ లో సందడి చేస్తున్నాయి. జై గా ఎన్టీఆర్ ఫుల్ పెరఫార్మెన్సు చూడడానికి ప్రేక్షకుల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో తెలియదు గాని... 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అదిరిపోయే లెవల్లో జరిగిందని టాక్. నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో బాగానే వెనకేస్తున్నాడని కూడా టాక్. 

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 'జై లవ కుశ' 80 కోట్ల పైమేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ప్రచారం జరుగుతుంది. అలాగే వరల్డ్ వైడ్ గా కూడా 'జై లవ కుశ' మంచి బిజినెస్ చేసిందని చెబుతున్నారు. ఇకపోతే 'జై లవ కుశ' శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా సమాచారం అందుతుంది. 'జై లవ కుశ' శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడానికి మూడు ప్రముఖ ఛానల్స్ పోటీపడినట్లుగా సమాచారం. అయితే చివరికి జెమిని ఛానల్ 'జై లవ కుశ' శాటిలైట్స్ రైట్స్ ని 14 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇన్‌సైడ్ సమాచారం. 

'జై లవ కుశ' లో ఎన్టీఆర్ మూడు భిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. మరి మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటన ఎలా వుండబోతుందో అని... అలాగే ఎన్టీఆర్ మూడు పాత్రలు చేయడంతోనే శాటిలైట్స్ రైట్స్ ఈ రేంజ్‌కి వెళ్లినట్టుగా 'జై లవ కుశ' చిత్ర బృందం చెబుతుంది. మరి ఎన్టీఆర్ కున్న క్రేజ్ అలాంటిది. అందుకే దర్శకుడు బాబీ సంగతి ఎలా వున్నా ఈ సినిమాకి ఇంతటి రేటు వచ్చింది అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇకపోతే వచ్చే ఆదివారమే 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించి సినిమాని ఈ నెల 21 న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Jai Lava Kusa Pre Release Business Sensation :

Jai Lava Kusa reached 100 Crores Pre Release Business 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ