'శతమానంభవతి' వంటి కుటుంబ కథా చిత్రంతో హిట్ కొట్టి.... దర్శకుడిగా విజయం సాధించిన సతీష్ వేగేశ్న మళ్ళీ ఒక కొత్త కుటుంబ కథను తయారు చేసుకుని హీరో కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా పేరొందిన దిల్ రాజు నిర్మాణ సారథ్యంలోనే తెరకెక్కనుంది. ఇక ఈ కుటుంబ కథా చిత్రానికి అందమైన టైటిల్ ని కూడా దర్శకనిర్మాతలు సెలెక్ట్ చేశారు. అదే 'శ్రీనివాస కళ్యాణం'. 'శ్రీనివాస కళ్యాణం' టైటిల్ కి ట్యాగ్ లైన్ గా శ్రీ వెడ్స్ నివాస్ అంటూ రిజిస్టర్ కూడా చేయించారు. అయితే ఈ చిత్రంలో హీరోగా చెయ్యమని దిల్ రాజు.. రామ్ చరణ్, మహేష్ బాబు ని సంప్రదించినట్లుగా వార్తలొచ్చాయి. అయితే వారిద్దరూ ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు చేసే ఉద్దేశ్యం లేదని చెప్పడంతో దిల్ రాజు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని 'శ్రీనివాస కళ్యాణం' కథతో కలవగా.. కథ నచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమా చేద్దామని చెప్పాడట.
అయితే 'శ్రీనివాస కళ్యాణం' కథ, దాని నిర్మాత నచ్చిన ఎన్టీఆర్ కి ఆ సినిమాని తెరకెక్కించే డైరెక్టర్ నచ్చలేదనే వార్తలు సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతున్నాయి. సతీష్ వేగేశ్న దర్శకుడిగా వద్దని... వేరెవరైనా కుటుంబ కథ చిత్రాల దర్శకుడుని తీసుకొస్తే సినిమా చేద్దామని దిల్ రాజుకి ఎన్టీఆర్ మాటిచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఎన్టీఆర్ 'బృందావనం' తర్వాత మరలా ఇలాంటి కుటుంబ కథా చిత్రాల జోలికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు దిల్ రాజు, ఎన్టీఆర్ సూచించినట్లుగా 'శ్రీనివాస కళ్యాణం' కథకి సతీష్ వేగేశ్న దర్శకుడిగా కాకుండా మరొక దర్శకుడిని తీసుకొస్తాడో... లేకుంటే దర్శకుడు సతీష్ వేగేశ్న మీద నమ్మకంతో మరో హీరో వేటలో పడతాడో తెలియాల్సి ఉంది.
ఇకపోతే దిల్ రాజు కొత్త దర్శకుడిని తీసుకొచ్చి ఎన్టీఆర్ తో ఓకె చేయించినా కూడా ప్రస్తుతానికి ఎన్టీఆర్ 'జై లవ కుశ' కంప్లీట్ కాగానే త్రివిక్రంతో సినిమా చెయ్యాల్సి ఉంది. మరి ఆ సినిమా పూర్తయ్యాక గాని ఆ 'శ్రీనివాస కళ్యాణం' లో నటించలేదు. ఈ లోపు ఎన్నో జరగవచ్చు.. చూద్దాం ఏం జరుగుతుందో..!