బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సైజు జీరో సాధించిన మొదటి భామగా ఆమె పేరును చెప్పుకుంటారు. కాగా కుమారుడు తైమూర్ పుట్టిన తర్వాత ఆమె తిరిగి రోజూ జిమ్‌లో కసరత్తులు చేస్తోంది. తిరిగి నాజూగ్గా తయారైన ఈ బ్యూటీ ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తమ అభిమాన నటి మరలా తమను అలరిస్తూ హంగామా చేయడానికి సిద్దమైందని ఆమె అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. కరీనా కపూర్ గతేడాది 'కీ అండ్ కా', 'ఉడ్తాపంజాబ్' చిత్రాలలో నటించి మెప్పించింది. ఈ రెండు చిత్రాలు మంచి టాక్‌ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె శశాంక్ ఘోష్ దర్శకత్వంలో 'వీరే ది వెడ్దిండ్' చిత్రంలో నటిస్తోంది. బుధవారం ఈ చిత్రం షూటింగ్ ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో కరీనా కపూర్‌తో పాటు సోనమ్ కపూర్, స్వరభాస్కర్ తదితరులు నటిస్తున్నారు. మొత్తం మీద కరీనాకపూర్ పేరుతో ఆమె అభిమానులు సోషల్‌మీడియాలో కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.