మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకుడిగా తెరకెక్కిన 'స్పైడర్' చిత్రం ఈ నెల 27 న దసరాకి విడుదల కాబోతుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.... స్పైడర్ నిర్మాతలు. మురుగదాస్ - మహేష్ కలయికలో మొదటిసారి తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడమే కాదు 'స్పైడర్' ప్రీ రిలీస్ బిజినెస్ కూడా ఆ లేవల్లోనే జరిగిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మహేష్ గత చిత్రం భారీ డిజాస్టర్ అయినా కూడా ఆ ఛాయలేమి.. 'స్పైడర్' బిజినెస్ మీద అస్సలు పడలేదంటేనే 'స్పైడర్' పై ఎంతటి అంచనాలున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
తెలుగు, తమిళ భాషలనే టార్గెట్ చేసి 'స్పైడర్' సినిమాని తెరకెక్కించినప్పటికీ హిందీ, మలయాళంలో కూడా 'స్పైడర్' ని డబ్ చేసి విడుదల చెయ్యాలనే ప్లాన్ లో 'స్పైడర్' చిత్ర బృందం మొదటి నుండి ఉంది. అయితే ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లోనే 'స్పైడర్' బిజినెస్ భీభత్సంగా జరిగింది అంటున్నారు. రెండు భాషలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ ఏరియాలు కలిపి ఏకంగా రూ.150 కోట్ల మేర బిజినెస్ చేసి.... సౌత్ ఇండియన్ ట్రేడ్ వర్గాలనే కాదు.. బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను కూడా షాక్ కి గురిచేసింది.అయితే ఇలాంటి బిజినెస్ ఇప్పటి వరకు కేవలం రజినీకాంత్ సినిమాలకు.. ‘బాహుబలి’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు తప్పితే సౌత్ లో మరే సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరిగింది లేదంటున్నారు. అలాగే 'స్పైడర్' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో అయితే 'బాహుబలి ది బిగినింగ్' తో సమానంగా 'స్పైడర్' బిజినెస్ ఉందంటున్నారు.
ఇక 'స్పైడర్' వరల్డ్ వైడ్ బిజినెస్ వివరాలు ఇలా వున్నాయి
ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో - 70 కోట్లు
తమిళనాడు - 17 కోట్లు
కర్ణాటక - 10.8 కోట్లు
ఓవర్సీస్ - 23 కోట్లు
ఇతర ఏరియాలు - 1 కోటి
వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ - 121.8 కోట్లు
శాటిలైట్, ఆడియో అండ్ డిజిటల్ రైట్స్ - 35 కోట్లు
మొత్తంగా 'స్పైడర్' వరల్డ్ వైడ్ బిజినెస్ - 156.8 కోట్లు