'అర్జున్‌రెడ్డి' చిత్రం రోజులు గడిచే కొద్ది మంచి కలెక్షన్లను వసూలు చేస్తూ ఉంటే.. ఈ చిత్రంలోని సీన్స్ పట్ల, మహిళలను, అమ్మలను బూతులుతిట్టే డైలాగ్స్ పట్ల నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఈ చిత్రంలోని లిప్‌లాక్ సీన్ ఉన్న పోస్టర్‌ని చింపివేయడంతో పాటు, తాజాగా నటి, యాంకర్ అనసూయ ఈ చిత్రం యూనిట్‌పై మండిపడిన సంగతి తెలిసిందే. ఈ వేడి ఇంకా చల్లారలేదు.. నటి, యాంకర్ శ్రావ్యారెడ్డి ఈచిత్రంపై పలు అభ్యంతరాలన వ్యక్తం చేసింది. ఆమె లేవనెత్తిన అభ్యంతరాలు సినిమాలోని కంటెంట్, డైలాగ్స్‌పై కాదు. ఆమె అభ్యంతరమంతా సినిమా టైటిలేనట.
టైటిల్‌లోని 'రెడ్డి' అనే పదం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమా చూసేటప్పుడు నాకు తలనొప్పి చాలా అరుదుగా వస్తుంది. కానీ ఈ 'అర్జున్‌రెడ్డి' చిత్రం చూసినప్పుడు తలనొప్పి వచ్చిన చిత్రాలలో ఈ 'అర్జున్‌రెడ్డి' ఒకటి అని ఆమె అంటోంది. సినిమాలో హీరో పేరు అర్జున్‌రెడ్డి దేశ్‌ముఖ్. రెడ్డిలకు దేశ్‌ముఖ్ ఉండదు. అసలు అతను రెడ్డి కాదు... దేశ్‌ముఖ్ అవుతాడు. ఈ సినిమాకి టైటిల్ పెట్టాలనుకుంటే 'అర్జున్ దేశ్‌ముఖ్ రెడ్డి' అని పెట్టాలి. అర్జున్‌రెడ్డి దేశ్‌ముఖ్ అని కాదు.. ఐ హేట్ ఇట్ అని ఆమె వ్యాఖ్యానించింది.
ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ శాలిని పాండే గురించి మాట్లాడుతూ, ఆమె ఫేస్‌కి యుద్దం చేసేంత సీన్ లేదు...డ్రగ్ అడిక్ట్ అయ్యేంత సీన్ అసలే లేదు.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రావ్యారెడ్డి, ఈ చిత్రం దర్శకుడిపై కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లవ్ ఫెయిల్ అయితే జీవితం నాశనం చేసుకోమని మీరు చెప్పాలనుకుంటున్నారా డైరెక్టర్ గారూ? అంటూ ఆమె విమర్శించింది.