బుల్లితెర మీద బిగ్ బాస్ షో ఇప్పుడు పెద్ద సెన్సేషన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకి విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. మొదట్లోనే ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్నాడనగానే ఈ షోకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇక షో మొదలయ్యేవరకు షోలో కంటెస్టెంట్స్ ని బయటపెట్టకుండా మేనేజ్ చేసిన యాజమాన్యం షో స్టార్టింగ్ రోజునే బయటపెట్టింది. అయితే హోస్ట్ కి ఎంత క్రేజ్ ఉన్నా కంటెస్టెంట్స్ కూడా కాస్తో కూస్తో క్రేజ్ వున్నవాళ్లు అయితే బావుండేది. కానీ షోలో పార్టిసిపేట్ చేస్తున్న వారితో తెలుగు ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారనే టాక్ మొదటినుండి ఉన్నప్పటికీ ఎన్టీఆర్ హోస్టింగ్ తో దాన్ని మేనేజ్ చేస్తూ వచ్చింది బిగ్ బాస్ టీమ్. మొదట్లో ఈ షోకి టీఆర్పీ రేటింగ్ బాగున్నప్పటికీ తర్వాతర్వాత రేటింగ్ డ్రాప్ అవుతూ వచ్చింది. మరి మొదట్లోకన్నా చివరిలోనే ఈ షో మీద ఆసక్తి ఏర్పడాల్సింది పోయి... ఆ షో మీద చివరి రోజుల్లో పెదవివిరుపులు వినబడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ షో మరో 20 రోజుల్లో పూర్తికాబోతుంది.
ఈసారి బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో మాత్రం మొదటి షోకి జరిగిన డ్యామేజ్ జరగకుండా కంటెస్టెంట్స్ విషయంలో షో నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకొమ్మని... అలాగే కాస్త పేరున్న సెలబ్రిటీస్ ని తీసుకోమని ఎన్టీఆర్ టీమ్ బిగ్‌బాస్ నిర్వాహకులకి చెప్పిందట. ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్ 2 కి కూడా ఎన్టీఆర్ నే హోస్ట్ గా స్టార్ మా యాజమాన్యం తీసుకుందనే టాక్ వుంది. అందుకే ఈ షో సెకండ్ సీజన్ కోసం కాస్తంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండేలా చెయ్యమని... కనీసం నలుగురైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినా ఉండాలని ఎన్టీఆర్ టీమ్ చెబుతుందట.
మరి కేవలం వారానికి రెండు రోజులు మాత్రమే ఎన్టీఆర్ ఈ షోని సూపర్ హిట్ గా నడిపిస్తున్నాడు. మరి మిగతా ఐదు రోజులు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటేనే ఈ షో కొన్నాళ్ళు తెలుగులో మనగలుగుతోంది. మరి ఎన్టీఆర్ టీమ్ చెప్పింది విని బిగ్ బాస్ యాజమాన్యం ఎలాంటి కంటెస్టెంట్స్ ని ఈ సీజన్ 2 కోసం తీసుకొస్తుందో వెయిట్ అండ్ సి.