Advertisementt

లోకేష్ లోని లోపాలు తెలుస్తున్నాయంట!

Thu 07th Sep 2017 04:04 PM
nara lokesh,andhra pradesh,special training,drawbacks  లోకేష్ లోని లోపాలు తెలుస్తున్నాయంట!
Nara Lokesh is Providing Special Training లోకేష్ లోని లోపాలు తెలుస్తున్నాయంట!
Advertisement
Ads by CJ

గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్‌లోని టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు నాయుడు యోగాను, మెడిటేషన్‌లో శిక్షణ ఇప్పించాడు. తాజాగా ఆయన ఏపీలోని టిడిపి నాయకులకు వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షలు నిర్వహించాడు. దీని వల్ల మంచి ఫలితాలోస్తే ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయి, కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు కూడా శిక్షణ-పరీక్షలు నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నాడు. 

'ప్రతి మనిషిలో కొన్ని లోపాలుంటాయి. సవరించుకోగలిగినంత వరకు సవరించుకోగలిగితే ఆ వ్యక్తి నుంచి రాబట్టే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ముందుగా నేనే ఈ పరీక్షలు చేయించుకుని విశ్లేషణలను తీసుకున్నాను. అందులో నా లోపాలు కొన్ని తెలిశాయి. వాటిని సవరించుకోవడానికి మనస్తత్వ విశ్లేషకుడి వద్ద శిక్షణ తీసుకుంటున్నాను'అని.. చంద్రబాబు తనయుడు మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నాడు. మరి పోయిన సారి యోగా, మెడిటేషన్‌ అన్న చంద్రబాబుకి ఈసారి వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో వేచిచూడాల్సివుంది...!

Nara Lokesh is Providing Special Training :

Andhra Pradesh Minister Nara Lokesh Says i Have Drawbacks

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ