రామ్ చరణ్ ప్రస్తుతానికి సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పక్కా పల్లెటూరి యువకుడిలా నటిస్తున్నాడు. 'ధృవ' లో కండలు పెంచి స్టైలిష్ గా కనబడిన చరణ్ ఇప్పుడు 'రంగస్థలం' లో పూర్తి భిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మొదటిసారిగా సమంత తో జోడి కడుతున్నాడు. ఈ సినిమా అంతా పల్లెటూరి వాతావరణంలోనే తెరకెక్కడంతో అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథగా ఉండబోతుందనేది మాత్రం స్పష్టంగా అర్ధంమవుతుంది. ఇకపోతే రామ్ చరణ్ ఒక పక్క 'రంగస్థలం' షూటింగ్ తో పాటే నిర్మాతగా తన తండ్రి 151 వ సినిమా 'సై రా నరసింహారెడ్డి' బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు.
అలాగే 'రంగస్థలం' సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెబుతుంది. ఇక ఆ చిత్రం విడుదల తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ చిత్రం ఏమిటి? అనే దాని మీద అందరిలో ఉత్కంఠ ఏర్పడింది. 'రంగస్థలం' తర్వాత చరణ్ చేయబోయేది బోయపాటితోనా? కొరటాలతోనా? అనేది మాత్రం సస్పెన్స్. ఎందుకంటే రామ్ చరణ్ తన తండ్రి చిరు చెయ్యబోయే 'సై రా' కి నిర్మాతగా పూర్తి బాధ్యతల్లో మునిగి ఉన్నాడు. చారిత్రక నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని చరణ్ భావిస్తున్నాడు. రాజమౌళి 'బాహుబలి'తో జాతీయ స్థాయిలో కొట్టిన భారీ హిట్ మాదిరిగానే ఈ 'సై రా' ని కూడా ఇండియా వైడ్ గా రిలీజ్ చేసి హిట్ కొట్టాలనుకుంటున్నాడు.
అందుకే టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లోని టాప్ స్టార్స్ ని ఈ సినిమా కోసం ఎంపిక చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాకి గుర్తింపు రావాలంటే ఆ మాత్రం ఉండాలని చిరు, చరణ్ లు భావిస్తున్నారు. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబందించిన భారీ సెట్టింగ్స్, భారీ పారితోషకాలు... ఇలా అన్నిటిని చక్కబెట్టాలంటే మరో మూవీతో చరణ్ హీరోగా బిజీ అయితే 'సై రా' నిర్మాణంలో ప్రోబ్లెంస్ రావొచ్చనే భావనలో మరో మూవీ కి సైన్ చెయ్యాలా లేకుంటే 'సై రా' కంప్లీట్ వరకు మరో మూవీని ఒప్పుకోకుండా ఉండాలా అనే డైలమాలో ఉన్నాడట చరణ్.