Advertisementt

తమన్నా కూడా మాటలు నేర్చింది..!

Thu 07th Sep 2017 01:57 PM
tamanna,bollywood,south cinema industry  తమన్నా కూడా మాటలు నేర్చింది..!
Tamanna About South Cinema Industry తమన్నా కూడా మాటలు నేర్చింది..!
Advertisement
Ads by CJ

దక్షిణాదిలో వెలిగే ఉత్తరాది భామలు, మరీ ముఖ్యంగా బహుభాషా నటీమణులు ఏ ప్రాంతానికి వెళ్లితే అక్కడి వారిని పొగుడుతూ ఉంటారు. పక్క పరిశ్రమలను చీదరగొట్టినట్లు మాట్లాడి తాత్కాలికంగానైనా వారున్న ప్రాంతం వారిని తెగమెచ్చేసుకునేలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా వివాదాస్పదమైతే మాత్రం తాము అలా అనలేదని, అదంతా మీడియా సృష్టి అని కొట్టిపడేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలోకి మిల్కీబ్యూటీ తమన్నాకూడా చేరింది. 

ఈమె 'బాహుబలి-ది బిగినింగ్‌' చిత్రంతో ఓ వెలుగు వెలిగింది. కానీ తర్వాత వచ్చిన 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'లో కేవలం కొన్ని సెకన్ల పాత్రకు పరిమితమైంది. ఆ తర్వాత దక్షిణాదిలో కూడా అవకాశాలు బాగా తగ్గాయి. దాంతో ముంబైకి వెళ్లి ఇక ఇక్కడి చిత్రాలలోనే నటిస్తానని, దక్షిణాది చిత్రాలలో మంచి పాత్రలు వస్తేనే చేసే విషయం ఆలోచిస్తానని చెప్పింది. ఇలా నోరు జారడంతో ఆమెకి దక్షిణాదిలో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో చేసిన తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది ఈ అమ్మడు. దక్షిణాదికి వచ్చిన ఈ భామ తనకు ఎందువల్లో దక్షిణాదిలో మంచి చిత్రాలు రావడం లేదని, కేవలం బాలీవుడ్‌ చిత్రాలలోనే నటిస్తానని ఎప్పుడు అనలేదని మాట మార్చింది. 

మొత్తానికి తాను అలా అనలేదని చేసిన స్టేట్‌మెంట్‌తో ఆమెకు మరిన్ని దక్షిణాది చిత్రాలలో అవకాశాలైతే వచ్చాయి. ప్రస్తుతం ఆమె రెండు తెలుగు చిత్రాలలో నటించడానికి ఒప్పుకుంది. అలాగే ఎన్టీఆర్‌తో ఓ పాటలో చిందులేయడానికి రెడీ అయింది. దీనికోసం ఆమె భారీగా పారితోషికం పుచ్చుకోవడానికి రెడీ అయింది. తమిళంలో ఆల్‌రెడీ విక్రమ్‌ నటిస్తున్న 'స్కెచ్‌' చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో నయనతార నటిస్తోన్న మరో హిందీ రీమేక్‌ చిత్రంలో కూడా నటిస్తోంది. 

Tamanna About South Cinema Industry:

Tamanna Back to South Cinema Industry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ