Advertisementt

నాగబాబుకి అందుకే జనసేన ఛాన్స్ ఇవ్వట్లేదా?

Wed 06th Sep 2017 11:10 PM
pawan kalyan,nagababu,janasena,nagababu janasena entry,mega family  నాగబాబుకి అందుకే జనసేన ఛాన్స్ ఇవ్వట్లేదా?
Nagababu Talks About Janasena Entry నాగబాబుకి అందుకే జనసేన ఛాన్స్ ఇవ్వట్లేదా?
Advertisement
Ads by CJ

'ఆరెంజ్‌' చిత్రంతో తాను ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డానని, పవన్‌కళ్యాణ్‌ ఎంతో సపోర్ట్‌ ఇచ్చినా తాను ఎలా అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలని ఎంతగానో మదనపడ్డానని, చివరకు బుల్లితెర సహాయంతో తాను పరిస్థితులను జయించానని మెగాబ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. ఓ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్‌ జనసేన పార్టీ గురించి కూడా ప్రస్తావించారు. తాను జనసేనలోకి రావడం కళ్యాణ్‌బాబు ఇష్టమని చెప్పాడు. ఆయన పార్టీకోసం పనిచేయమంటే తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. అందరిలా తాను కూడా జాయిన్‌ అయి పనిచేస్తానని అనడానికి నేను పబ్లిక్‌ను కాదని, పవన్‌కళ్యాణ్‌కి అన్నయ్యనని చెప్పారు. 

తాను పార్టీలోకి వస్తే పవన్‌కి ప్లస్‌ కాకపోయినా ఫర్వాలేదని, కానీ మైనస్‌కాకుండా ఉంటే చాలనుకుంటున్నానని అన్నాడు. తనకు పదవులు అక్కర్లేదని పవన్‌ పిలిస్తే తాను సామాన్య కార్యకర్తగా కూడా పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపాడు. లైఫ్‌లో తాను పడ్డ కష్టాలను పవన్‌ చూశారని, ఇకపై అంతగా కష్టపడకూడదని పవన్‌ భావిస్తున్నాడని అందుకే ఇప్పటివరకు ఆయన తనను పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. 

ఈ యాంగిల్‌లో పవన్‌ ఆలోచిస్తూ ఉండి ఉంటాడని నాగబాబు చెప్పుకొచ్చారు. పవన్‌ అంటే వ్యక్తిగా తనకి ఎంతో ఇష్టమని, వ్యక్తిగా పవన్‌ అమేజింగ్‌ పర్సన్‌ అని నాగబాబు కితాబునిచ్చారు. 

Nagababu Talks About Janasena Entry:

Pawan Kalyan thinking on Naga Babu to Janasena Party Entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ