తెలుగులో తొలిసారిగా కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా గోవా బ్యూటీ ఇలియనా ఒకప్పుడు సంచలనం సృష్టించింది. కానీ దక్షిణాదిలో కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఈ బొడ్డు సుందరి బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కింది. కానీ అక్కడ ఆమెకు సరిగా మంచి అవకాశాలు రాకపోవడంతో ఈ నడుము సుందరి దిగాలు పడింది. ఇక విషయానికి వస్తే సాధారణంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఒక్కసారి కథ ఓకే చేశాడంటే ఇక ఆ చిత్రం విషయం కి సంబంధించి దేనిలో వేలు పెట్టడు. కానీ ఆయన పనిగట్టుకుని దిల్‌రాజు-అశ్వనీదత్‌ల కాంబినేషన్‌ల వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించే చిత్రంలో ఇలియానాను పెట్టుకోమని దర్శకనిర్మాతలకు రికమెండ్ చేశాడని వార్తలు వస్తున్నాయి.
తాజాగా వీటిపై ఇలియానా స్పందించింది. మంచి కథ అయితే మహేష్‌తో ఖచ్చితంగా నటిస్తానని ఆమె అంటోంది. తాజాగా ఆమె ట్విట్టర్‌లో అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మహేష్‌తో కలిసి నటించే విషయం గురించి ప్రశ్న అడిగాడు. దానికి ఆమె సమాధానం ఇస్తూ....ఇప్పటికైతే మహేష్‌తో నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు. కథ బాగుంటే ఖచ్చితంగా మహేష్‌తో నటిస్తాను అని చెప్పుకొచ్చింది.
మరో అభిమాని.. రవితేజ గురించి అడగ్గా ఆమె సమాధానం ఇస్తూ....నాకు ఇష్టమైన నటుల్లో రవితేజ ఒకరు. ఆయనతో కలిసి పనిచేస్తున్నంతసేపు ఫన్నీగా ఉంటుంది. ఆయనతో ఎన్నిసార్లు నటించినా సరదాగానే ఉంటూఉంటుంది.. అని సమాధానం ఇచ్చింది. ఇక తాజాగా ఆమె నటించిన 'బాద్‌షాహో' చిత్రం వారం రోజుల్లో 50కోట్లు కలెక్షన్లు వసూలు చేసి దూసుకుపోతోంది.