Advertisementt

నందమూరి వారసుడ్ని దించుతున్నారయ్యా..!

Wed 06th Sep 2017 05:56 PM
nandamuri mokshagna,balakrishna,mokshagna cine entry,mokshu cine entry date  నందమూరి వారసుడ్ని దించుతున్నారయ్యా..!
Nandamuri Mokshagna Entry Date Fixed నందమూరి వారసుడ్ని దించుతున్నారయ్యా..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారు గాని మోక్షజ్ఞ మాత్రం బయటికే రావడంలేదు. బాలయ్య 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణికి టెక్నీకల్ విభాగంలో పనిచేసిన మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే టైం దగ్గర పడిందనే సంకేతాలు బాలయ్య ఇస్తున్నాడు. ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పిన బాలయ్య అది ఎప్పుడనేది చెప్పకుండా ఇప్పటివరకు సస్పెన్స్ లో పెట్టేశాడు.

అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ, మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని... అది కూడా 2018 జూన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పేశాడు. ఇక అభిమానుల అభిమానమే తమకు శ్రీరామరక్ష అని చెబుతున్నాడు బాలకృష్ణ. అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోయే సినిమాకి దర్శకుడు ఎవరనేది కూడా త్వరలోనే ప్రకటిస్తానని చెబుతున్నాడు. ఇకపోతే మోక్షు మొదటి సినిమా అలాంటి ఇలాంటి కథతో కాకుండా ఒక డిఫ్రెంట్ కథతో రావాలని అందుకే స్క్రిప్ట్ వర్క్ లో...కథ విషయంలో బాలకృష్ణ చాలా కేర్ తీసుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది.

ఇకపోతే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోయే మోక్షజ్ఞ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ పిక్ లో మోక్షజ్ఞ చాలా స్టయిల్ గా ఫోన్ మాట్లాడుతూ కనబడుతున్నాడు. ఇక ఈ పిక్ చూసిన అందరూ అప్పుడే మోక్షులో హీరోకుండాల్సిన లక్షణాలు వచ్చేశాయనే కామెంట్స్ చేస్తున్నారు.

Nandamuri Mokshagna Entry Date Fixed:

Nandamuri Natasimha Reveals Nandamuri Mokshagna Cine Entry Time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ