కొత్త కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. దీంతో బాలీవుడ్‌లో కత్రినా కైఫ్ వంటి నిన్నటితరం స్టార్ హీరోయిన్లకు అవకాశాలు బాగా తగ్గాయి. అయినా పట్టువదలని విక్రమార్కురాలిగా కత్రినా పోరాడుతోంది. ఇటీవల ప్రభాస్‌తో కలిసి నటించే ఛాన్స్ వచ్చినా కూడా ప్రస్తుతం తన చేతిలో బాలీవుడ్‌ని ఏలుతున్న ముగ్గురు ఖాన్ త్రయం చిత్రాలలో అవకాశాలు ఉండటంతో ఆమె ప్రభాస్ ఆఫర్‌ని కొట్టిపడేసింది. ఇక ప్రస్తుతం ఆమె 'టైగర్ జిందాహై' చిత్రంలో సల్మాన్‌ఖాన్ సరసన నటిస్తోంది. 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రంలో అమీర్‌ఖాన్‌తో నటిస్తోంది. ఇక దర్శకుడు ఆనంద్. ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌తో జతకడుతోంది. ఇక ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, వృతి విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసి, దానికి ఓ క్యాప్షన్ రాసింది. దీంతో ఆమె పోస్ట్ చేసిన ఫొటో కన్నా దానికి రాసిన క్యాప్షన్‌కి ఆమె అభిమానులు ఫిదా అయిపోయి ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. ఆమె ఆ క్యాప్షన్‌లో 'నేను ఎప్పుడు ఒక తప్పును రెండు సార్లు చేయను. ఐదారు సార్లు చేస్తాను. ఎందుకంటే నేను చేసేది తప్పా ?కాదా? అనేది తెలుసుకోవడం కోసం..' అంటూ ఆమె రాసిన క్యాప్షన్‌ని అందరూ మెచ్చుకుంటూ, నగ్నసత్యాన్ని, నిజజీవిత రహస్యాన్ని ఎంతో చక్కగా చెప్పావు కత్రినా అని సంబరపడుతున్నారు. మొత్తానికి వార్తల్లో నిలవడం ఎలాగో కత్రినాని చూసి మిగిలిన హీరోయిన్లు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని పలువురు సెటైర్లు వేస్తున్నారు.