Advertisementt

మాజీ భర్తపై మాట పడనివ్వట్లే..!

Mon 04th Sep 2017 11:45 PM
hrithik roshan,sussanne khan,kangana ranaut,sussanne support,ex husband  మాజీ భర్తపై మాట పడనివ్వట్లే..!
Sussanne Khan comes out in support of ex-husband మాజీ భర్తపై మాట పడనివ్వట్లే..!
Advertisement
Ads by CJ

గతేడాది బాలీవుడ్‌ క్వీన్‌ కంగనారౌనత్‌కి, స్టార్‌ హృతిక్‌రోషన్‌కి జరిగిన పలు సంఘటనలు సంచలనం సృష్టించాయి. తనను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పి, హృతిక్‌ పలు కుంటిసాకులతో తనను వదిలేశాడని చెప్పి బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది కంగనా. తాజాగా ఆమె నాటి విషయాలనే మరలా గుర్తు చేస్తూ సంచలనాలకు వేదిక అవుతోంది. అయినా హృతిక్‌ మాజీ ప్రేయసి అవకాశం చిక్కినప్పుడల్లా తన మాజీ ప్రియుడు హృతిక్‌ రోషన్‌పై ఏదో ఒకటి మాట్లాడుతూ సంచలనాలకు వేదిక అవుతోంది. కానీ ఇదే సమయంలో హృతిక్‌ రోషన్‌కి ఆయన మాజీ భార్య సుషానే రోషన్‌ మద్దతు పలుకుతోంది. అప్పుడే కాదు ఇప్పుడు కూడా కంగనా రౌనత్‌కి ధీటుగా సమాధానం ఇస్తూ హృతిక్‌కి ఆయన మాజీ భార్య అండగా నిలుస్తోంది. 

'ఇలాంటి ఆరోపణలు, విషాదగాథలు మంచి మనుషుల వ్యక్తిత్వాలను దెబ్బతీయవు..' అని తాజాగా కంగనా హృతిక్‌పై చేసిన వ్యాఖ్యలకు సుషానే ధీటుగా జవాబిచ్చింది. దీంతో హృతిక్‌తో భౌతికంగా విడిపోయినా ఆయన భార్య ఇప్పటికీ తన మాజీ భర్తపై ఈగను కూడా వాలనివ్వకుండా చేయటం చూసి ఆమె గొప్పతనాన్ని నెటిజన్లు పొగుడుతున్నారు. గతంలోనే హృతిక్‌, కంగనాను ఆలింగనం చేసుకున్న ఓ పీక్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నాడు హృతిక్‌ శ్రేయోభిలాషులంతా కావాలనే ఇలాంటి ఫొటోలను కంగనా రౌనత్‌ సోషల్‌మీడియాలో పనిగట్టుకుని పోస్ట్‌ చేస్తోందని మండిపడ్డారు. 

అయితే వీరందరూ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో కేవలం హృతిక్‌ మాజీ భార్య సుషానే రోషన్‌ మాత్రం 'ఆ ఫొటోలన్నీ మార్ఫ్‌ చేసినవి, కావాలంటే నేను కూడా అలాంటి ఎన్నో ఫొటోలను మార్ఫింగ్‌ చేయగలను. ఈ మద్యకాలంలో తప్పుడు వార్తలే ఎక్కువగా వైరల్‌ అవుతుండటం బాధాకరం. ఈ విషయంలో కూడా నేను హృతిక్‌కే సపోర్ట్‌ చేస్తాను...' అంటూ కొన్ని మార్ఫింగ్‌ ఫొటోలను పోస్ట్‌ చేసి, తన మాజీ భర్తకు మద్దతుగా నిలిచింది. 

Sussanne Khan comes out in support of ex-husband:

Hrithik Roshan and Sussanne Khan separated a few years back but the married couple still continues to come together, time and again, to spend time with their children.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ