Advertisementt

లీక్ లపై 'స్పైడర్' టీమ్ క్లారిటీ..!

Mon 04th Sep 2017 06:51 PM
spyder,mahesh babu,spyder team,prince mahesh babu,ar murugadoss  లీక్ లపై 'స్పైడర్' టీమ్ క్లారిటీ..!
Spyder Team Clarity on Movie Scenes Leak లీక్ లపై 'స్పైడర్' టీమ్ క్లారిటీ..!
Advertisement
Ads by CJ

ఎట్టకేలకు 'స్పైడర్' చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. బ్యాలెన్స్ పాట షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్న చిత్ర బృందం మరో వైపు 'స్పైడర్' ప్రమోషన్ ని కూడా వేగవంతం చేసింది. తమిళంలో 'స్పైడర్' ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా జరిపి ఇక్కడ తెలుగులో మాత్రం 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరపాలనే యోచనలో ఉంది చిత్ర బృందం. విడుదలకు సిద్దమవుతున్న 'స్పైడర్' కి సెన్సార్ కార్యక్రమాలను కూడా త్వరలోనే పూర్తి చేస్తారంటున్నారు.

అయితే ఇప్పుడు 'స్పైడర్' గురించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే 'స్పైడర్’లోని కొన్ని కీలక సన్నివేశాలు లీక్ అయ్యాయని ప్రచారం జరుగుతుంది. మహేష్‌పై చిత్రీకరించిన ఓ యాక్షన్ సన్నివేశంతో బాటు అప్పుడెప్పుడో కొన్ని సీన్స్ లీక్ అయి యూట్యూబ్‌లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే 'స్పైడర్' చిత్ర బృందం మాత్రం అలాంటిదేమీ జరగలేదని 'స్పైడర్' సోషల్ వెబ్ పేజీ ట్విటర్‌లో క్లారిటీ ఇచ్చింది. ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని.. అలాంటి రూమర్స్ ని నమ్మొద్దని చెబుతుంది.

కొంతమంది 'స్పైడర్' కి నెగెటివ్ పబ్లిసిటీ ఇవ్వడం కోసమే కావాలని ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి సర్క్యులేట్ చేస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతున్న మాట. ఇక ఈ విషయమై సెన్సార్ బోర్డుకు కూడా  ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ - రకుల్ ప్రీత్ కలిసి ఉన్న రొమాంటిక్ పిక్ ని హీరోయిన్ రకుల్ విడుదల చేసింది. ఆ పిక్ లో మహేష్ - రకుల్ ల రొమాన్స్ మాములుగా లేదు. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, తమిళ నటుడు భరత్ విలన్స్ గా నటిస్తుండగా... హరీష్ జై రాజ్ సంగీతం అందిస్తున్నాడు.

Spyder Team Clarity on Movie Scenes Leak:

Super Star Mahesh Babu Spyder Movie Shooting Completed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ