Advertisementt

12 కోట్ల ఫైట్, 32 కోట్ల పాట..నెక్స్ట్ ఏంటి?

Mon 04th Sep 2017 06:44 PM
2.0,director shankar,rajinikanth,32 crores song  12 కోట్ల ఫైట్, 32 కోట్ల పాట..నెక్స్ట్ ఏంటి?
Rs 32 Crores for a Single Song for Shankar 2.0 12 కోట్ల ఫైట్, 32 కోట్ల పాట..నెక్స్ట్ ఏంటి?
Advertisement
Ads by CJ

శంకర్ - రజినీకాంత్ కలయికలో తెరకెక్కుతున్న '2.0' చిత్రం రోజు రోజుకి అంచనాలు పెంచేస్తుంది. ఇప్పటికే అతి భారీ బడ్జెట్ సినిమాగా ఇండియాలోనే సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడొక సెన్సేషనల్ న్యూస్ మీడియాలో హల్చల్ చెయ్యడమే కాదు అయ్యబాబోయ్ అనిపిస్తుంది. అదేమిటంటే '2.0' కోసం ఒక ఖరీదైన పాటని తెరేకేక్కిస్తున్నారట. ఆ పాట ఖరీదు అక్షరాలా 32 కోట్లు అంటూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఒక్క పాటకే ఇంత ఖర్చా అంటూ అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు.

మరి ఈ రేంజ్లో పాటని తెరకెక్కించడంలో ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారేమో..! ఇప్పటికే 12 కోట్ల బడ్జెట్ తో రజినీకాంత్ మరియు అక్షయ్ కుమార్ మధ్య యాక్షన్ సన్నివేశాన్ని తెరక్కించిన శంకర్ ఇప్పుడు '2.0' పాటకోసం ఇలా 32 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. శంకర్ సినిమాల్లో పాటల సెట్టింగ్స్ కి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకోసమే పాటల కోసం భారీగా ఖర్చుపెడుతుంటాడు. మరీ ఎంత భారీగా పెట్టిన ఇంత భారీతనం అవసరమో ఏమోగానీ ఇప్పుడు ఈ విషయమై అన్ని ఇండస్ట్రీలలో హాట్ హాట్ చర్చ అయితే షురూ అయ్యింది. 

ఇక ఈ ఖరీదైన పాటలో ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తూ భారీ స్థాయిలో రోబోలను చూపిస్తూ.. వాటి మధ్య రజినీకాంత్ - హీరోయిన్ అమీ జాక్సన్‌ల మీద ఈ పాట చిత్రీకరణ జరిపినట్లుగా చెబుతున్నారు. మరి ఒక పాటకే ఇంతలా షాక్ లు ఇస్తున్న శంకర్ సినిమాలో ఇంకెలాంటి ఖరీదైన సన్నివేశాలతో వేడిక్కించబోతున్నాడో అనేది శాంపిల్ గా '2.0' మేకింగ్ వీడియోలో చూపించాడు. అలాగే మొత్తంగా సినిమాని చూడాలంటే 2018 జనవరి ఎండింగ్ వరకు ఆగాల్సిందే..!

Rs 32 Crores for a Single Song for Shankar 2.0:

Director Shankar is spending Rs. 32 crores for 2.0 single song giving a shock to everybody.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ