Advertisementt

'జై' రావణా.. 'జై..జై...జై...' సింహాసనా!

Mon 04th Sep 2017 11:25 AM
jai lava kusa,jr ntr,jai ravana,jai ravana song,jai poster  'జై' రావణా.. 'జై..జై...జై...' సింహాసనా!
Jai Lava Kusa Jai Ravana Song Sensation 'జై' రావణా.. 'జై..జై...జై...' సింహాసనా!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవకుశ' లుక్‌తో పాటు ఈ పాత్ర టీజర్‌ కూడా అదిరిపోయింది. నేడు 'జై లవకుశ' చిత్రానికి ఇంత హైప్‌ వచ్చిందంటే అది కేవలం జై టీజర్‌ పుణ్యమే. 'లవ, కుశ' లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నా కూడా ఈ చిత్రానికి భారీ అంచనాలు వచ్చింది మాత్రం కేవలం కొన్ని సెకన్లలలోనే ఎన్టీఆర్‌ చూపించిన ఆ పాత్ర హావభావాలు, ఆయన నటన, ఆయన చెప్పే డైలాగ్‌ డెలివరీ వల్ల మాత్రమే. 

ఇక ఈ చిత్రానికి సంబంధించిన 'జై' పాత్రకు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్‌ చేసి తన అభిమానులకు ఎన్టీఆర్‌ అనుకోని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో రావణుడికి సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్‌ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. రావణా జై..జై...జై... సింహాసనా జై...జై...జై అనే క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ని లహరి మ్యూజికల్‌ సంస్థ సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్‌ ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఉన్నాడు. సాయికుమార్‌ది రావణునికి సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ అని పోస్టర్‌ని చూస్తేనే అర్ధమైపోతోంది. సమ సమాజ్‌ పార్టీ నేతగా ఈ రావణుడి పాత్ర ఉండనుందని ఇంతకు ముందే తెలిసిన విషయం. 

రావణుడి పాత్రకు రావణా జై...జై..జై.. సింహాసనా... జై...జై...జై.. అనే బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉంటుందని సమాచారం. దీనికి దేవిశ్రీప్రసాద్‌ అద్భుతమైన అదిరిపోయేలా, ఈ రావణుడి పాత్రను 100రెట్టు పవర్‌ఫుల్‌గా చూపించేలా ఆయన ఆర్‌ఆర్‌ కూడా ఇస్తున్నాడట. సోషల్‌మీడియాలో ఈ ట్రాక్‌ వింటుంటే గూస్‌ బమ్స్‌ వస్తాయని కొందరు, మరికొందరు అదిరిపోయిందంటూ కొందరు కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. 

Jai Lava Kusa Jai Ravana Song Sensation:

Jr NTR Jai Lava Kusa Audio Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ