Advertisementt

షాక్..ఈ టాప్ హీరో ప్రెగ్నెంట్..!

Sun 03rd Sep 2017 11:19 PM
the great indian laughter challenge 5,akshay kumar,pregnant  షాక్..ఈ టాప్ హీరో ప్రెగ్నెంట్..!
Akshay Kumar Pregnant Avathar షాక్..ఈ టాప్ హీరో ప్రెగ్నెంట్..!
Advertisement
Ads by CJ

సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల.. కాదేదీ కవితకనర్హం అని మహాకవి చెప్పాడు. ఇదే సినిమాలకి అప్లై చేస్తే కాదేదీ ప్రమోషన్లకు అనర్హం అని చెప్పవచ్చు. సినిమా నుంచి బుల్లితెర కార్యక్రమాల వరకు, టీవీలలో ప్రసారమయ్యే షోల వరకు అన్నింటిని వినూత్నంగా ప్లాన్‌ చేసి ప్రోమోలు వదిలి ప్రేక్షకులను ఆకర్షించి, టీఆర్పీలు పెంచుకోవాలని నేటితరం షో నిర్వాహకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఓ హిందీ బుల్లితెర షోకి సంబంధించిన పబ్లిసిటీని వినూత్నంగా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ గతంలో 'ఖత్రోంకి ఖిలాడి, డేర్‌ టు డ్యాన్స్‌' అనే రియాల్టీషోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కాగా ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న '2.0' చిత్రంలో విలన్‌ పాత్రను చేస్తున్నాడు. అలాగే 'ప్యాడ్‌మేన్‌, గోల్డ్‌' చిత్రాలలో నటిస్తున్నాడు. త్వరలో అజిత్‌, పవన్‌లు నటించిన 'కాటమరాయుడు' ( వీరం) రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇక త్వరలో ఆయన హోస్ట్‌గా చేయనున్న ఓ రియాల్టీ షో ప్రసారం కానుంది. 'ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ 5'షోకి ఆయన న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ప్రచారంలో భాగంగా అక్షయ్‌కుమార్‌లో ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. 

ఈ వీడియోలో అక్షయ్‌కుమార్‌ గర్బం దాల్చినట్లు, తదనంతరం ఐదుగురు కవలలకి జన్మనిచ్చినట్లు చూపించారు. మొత్తానికి ఆడాళ్లే కాదు.. మగాళ్లు కూడా గర్బం దాల్చి పిల్లలకు జన్మనిచ్చినట్లు ఈ షో నిర్వాహకులు చేస్తున్న ప్రమోషన్‌కి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు కూటి కోసం కోటి తిప్పలు అనే నానుడి ఉండేది. కానీ నేడు టీఆర్పీల కోసం కోటిన్నొకటి తిప్పలు అని మార్చుకోవాలేమో అంటున్నారు...! మరి ఈ షో వీక్షకులను ఏమాత్రం అలరిస్తుందో వేచిచూడాల్సివుంది....! 

Akshay Kumar Pregnant Avathar:

Akshay Kumar Pregnant Promotion for The Great Indian Laughter Challenge 5 Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ