ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం 'అర్జున్‌రెడ్డి' చుట్టూనే వార్తలు తిరుగుతున్నాయి. ఈ చిత్రం సంచలనంగా మారిన నేపథ్యంలో అందరూ ఈచిత్రంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హాట్ యాంకర్ అనసూయ ఈ చిత్రంలోని బూతులు, డైలాగ్స్, సీన్స్‌పై తన అభ్యంతరం వ్యక్తం చేసింది.దానిపై చిత్ర యూనిట్‌తో పాటు నెటిజన్లు మండిపడ్డారు.
మొదట అనసూయ వేసే డ్రస్సులు చూసి మాట్లాడాలని, ఆమె దుస్తులు దారణంగా ఉంటున్నాయనని, రెచ్చగొట్టేలా కావాలనే ఆమె ఈ విధంగా డ్రస్‌లు ధరిస్తోందని పలువురు మండిపడుతున్నారు. దీనిపై యాంకర్ అనసూయ స్పందించింది. చాలా మగాళ్లు ఎప్పుడు ఆడాళ్లు తమకోసమే తయారవుతారని భావిస్తూ ఉంటారు. లిజన్ డ్యూడ్.. మా షెడ్యూల్స్, పీరియడ్స్, మానసికావస్థ, స్థలం, కాలం, మేము కలువబోయే వ్యక్తులు, మ్యాచింగ్ షూస్, మ్యాచింగ్ బ్యాగ్స్, మ్యాచింగ్ లిప్‌స్టిక్, సరిపడే లో దుస్తుల లభ్యత మొదలైన వాటి ఆధారంగా మేము ధరించే డ్రస్ ఉంటుంది. ఆ జాబితాలో మీరు 'లేరు'.
సో చిల్ అంటూ ఆమె పేర్కొన్న విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. మరి అనసూయకి ఉన్న మాట అంటే ఉలుకెందుకో అని కొందరు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.