అవినీతిలో ప్రధమస్థానమే.. అయినా మోదీ ప్రయత్నాలు ప్రశంసనీయం...!
దేశ అభివృద్దిని నిరోధకంగా మారి, దేశ ప్రజలను పీడించుకు తింటున్న అవినీతి విషయంలో భారత్ ఇంకా అగ్రస్థానంలోనే ఉందట. మోదీ అవినీతి అంతానికి ఎనలేని కృషి చేస్తున్నప్పటికీ ఆసియాలో అవినీతి అధికంగా ఉన్న దేశాలైన వియత్నాం, థాయ్‌లాండ్, పాకిస్థాన్, మయన్మార్‌లను మించి అవినీతిలో భారతదేశం ప్రధమ స్థానంలో ఉందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే జర్మనీకి చెందిన ఎన్జీవో సంస్థ తేల్చిచెప్పింది. ఆసియాలోనే అత్యంత అవినీతి భారత్‌లో ఉందని పోర్బ్స్ సంస్థ తేల్చిచెప్పినట్లు ఈ ఎన్జీవో సంస్థ పేర్కొంది.
ముఖ్యంగా భారత్‌లోని పాఠశాలలు, ఆసుపత్రులు, ధృవీకరణ పత్రాలు జారీ చేసే సంస్థలు, పోలీసులలో అవినీతి విచ్చలవిడిగా ఉందని ఆ సంస్థ ప్రకటించింది. ఇక అవినీతిని రూపుమాపడానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషి పట్ల దేశంలోని అత్యధికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేలను 18 నెలల పాటు 16 దేశాలలో 20వేల మంది అభిప్రాయాలను సేకరించి తయారు చేశామని ఆ సంస్థ ప్రకటించింది. ఇది మనదేశ పరిస్థితి. ఓ కవి చెప్పినట్లు మనం జనాభాలో, అవినీతిలో ఎప్పుడు ముందజంలోనే ఉంటామని చెప్పిన విషయం నిష్ఠూర సత్యమనే చెప్పాలి.