Advertisementt

పవన్ కి అన్నావదినలు షాకిచ్చారు..!

Sat 02nd Sep 2017 07:07 PM
pawan kalyan,pspk 25 sets,chiranjeevi,surekha,trivikram srinivas,visit  పవన్ కి అన్నావదినలు షాకిచ్చారు..!
Chiranjeevi and Surekha's Visit to Pawan Kalyan's Film Sets పవన్ కి అన్నావదినలు షాకిచ్చారు..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ నేడు శనివారం పుట్టినరోజు సందర్భంగా ఫాన్స్ కి సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఇచ్చేశాడు. కేవలం తాను పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉంటానని చెప్పాడే తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్ అంటూ చక చకా జరిగిపోతున్నాయి. తనది జగమంత  కుటుంబం అని చెప్పిన పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజుకి ఒక్క రోజు ముందే అన్నయ్య చిరు ఆశీస్సులు అందుకుని మెగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన తాజా చిత్ర టైటిల్ ని వదలకుండా సినిమా రిలీజ్ డేట్ తో పాటు కాన్సెప్ట్ పోస్టర్ అంటూ కొత్తగా ఒక పోస్టర్ ని విడుదల చేసి కన్ఫ్యూజ్ చేసినప్పటికీ అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఒక పాటని వదిలి ఫ్యాన్స్ ని కూల్ చేశాడు. అయితే పవన్ ఫాన్స్ మాత్రం ఈ మ్యూజికల్ సర్ప్రైజ్ ని అస్సలు ఊహించలేదు.

ఇక పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీతో పాటే సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కి బెస్ట్ విషెస్ అందిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు వీరు.

అయితే  కేవలం పవన్ కి మాత్రమే షాక్ ఇవ్వడం తెలుసా మేము షాక్ ఇస్తామని మెగా బ్రదర్ చిరంజీవి తన వైఫ్ సురేఖ తో సహా కలిసి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్ర షూటింగ్ స్పాట్ కి పవన్ కి హింట్ కూడా ఇవ్వకుండా వెళ్లి తమ్ముణ్ణి సర్ప్రైజ్ చేశారు. ఇక అక్కడ చిరు, సురేఖలు, పవన్ తో దాదాపు ఒకగంట సేపు గడిపి పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. అలాగే పవన్ చిత్ర సెట్స్ లో చిరు, సురేఖల సందడి హైలెట్ అంటున్నారు. ఇక అన్నా, వదినలు స్వీట్ సర్ప్రైజ్ కి పవన్ కూడా చాలా సంతోషించాడని చిత్ర యూనిట్ చెబుతున్నది. సో... పవన్ తన పుట్టిన రోజు ని అవైడ్ చేసినా ఆయనకు అందాల్సినవి భలే అందుతున్నాయి కదా!

Chiranjeevi and Surekha's Visit to Pawan Kalyan's Film Sets:

With celebrations have gone to the zenith across Telugu states on the occasion of Power Star Pawan Kalyan's birthday, here is one more exciting moment for mega fans to get merriment. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ