ఒక వైపు అర్జున్ రెడ్డి చిత్రం పై దండయాత్ర జరుగుతూనే వుంది. మరో వైపు టాప్ సెలెబ్రిటీస్ అందరూ..అర్జున్ రెడ్డి ని ఆకాశానికి ఎత్తేయడం కామన్ అయిపోయింది. వి. హనుమంత రావు మొదలుకుని, ఫేస్ బుక్, ట్విట్టర్ అని సంబంధం లేకుండా మహిళలందరూ ఈ సినిమాపై మండిపడుతున్నారు. యాంకర్, నటి అయిన అనసూయ కూడా అర్జున్ రెడ్డి పై యుద్ధం ప్రకటించింది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ మొదలుకుని, అనేకమంది సెలబ్రిటీస్ ఈ చిత్రాన్ని టాప్ ప్లేస్ లో పెడుతున్నారు. ఆఖరికి అమావాస్యకి, పౌర్ణమికి తన ట్విట్టర్ లో స్పందించే మహేష్ బాబు కూడా అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు.
'అర్జున్ రెడ్డి' సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు కురిపించిన పొగడ్తల వర్షం ఇలా వుంది. 'బోల్డ్, రా, ఇంటెన్స్, ఒరిజినల్ అండ్ బ్రిలియంట్ అంటూ..మూస ధోరణిలో వస్తున్న చిత్రాలకు అర్జున్ రెడ్డి ఓ కొత్త మార్గాన్ని చూపించింది. అర్జున్ రెడ్డిగా లైఫ్ టైం పర్ఫార్మెన్స్‌తో విజయ్ దేవరకొండ అదరగొట్టారు. అద్భుతంగా నటించారని చెప్పడం కూడా తక్కువే. శాలిని, అర్జున్ రెడ్డి స్నేహితులు, మిగతా అన్ని పాత్రలు బ్రిలియంట్‌గా ఉన్నాయి. దర్శకుడిగా సందీప్ వంగా కథ రాసుకొని తెరకెక్కించిన విధానం బాగుంది. తొలి సినిమానే ఇంత అద్భుతంగా తీయడం నమ్మలేకపోతున్నా' అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.