అర్జున్ రెడ్డి చిత్రం హిట్ తో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ టాక్ అఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. పెళ్లి చూపులుతో అమాయకంగా కనిపించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అర్జున్ రెడ్డి తో సీనియర్ హీరో లెక్క లెక్చర్లు ఇచ్చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో కావాల్సినంత కాంట్రవర్సీని సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి టీమ్ అందరిలో విజయ్ మాత్రమే అర్జున్ రెడ్డిని విమర్శించిన వాళ్ళని తన మాటల తూటాలతో ఆడేసుకుంటున్నాడు. ఒక పక్క పొలిటీషియన్స్ రంగంలోకి దిగి అర్జున్ రెడ్డి భరతం పట్టాలంటుంటే మరో పక్క మహిళలు కూడా అర్జున్ రెడ్డి పై ఇంతెత్తున లేస్తున్నారు.
ఏది ఎలాగున్నా అర్జున్ రెడ్డి మాత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. అందుకేనేమో హీరో విజయ్ దేవరకొండ కి కాస్త ఎక్కువైనట్టు కనబడుతుంది. తన సినిమాలోని అన్ని సీన్లను తెగ సమర్థించుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి లో ఎన్నో బూతు డైలాగులు, లిప్ లాక్ సీన్లు ఉన్నాయని, పొగతాగడం వంటివి చూపించారని వీటి నుంచి ఏం నేర్చుకోవాలని ప్రముఖ మీడియా ఛానల్ ప్రశ్నలు వర్షం కురిపించింది. అయితే ఆ ప్రశ్నలకు విజయ్ అస్సలు కంగారు పడకుండా ఎంతో కూల్ గా సమాధానాలు చెప్పాడు.
ఈ సినిమాలో మీ ఫోకస్ అంతా ఆ ముద్దు సీన్లపైనే ఉంది. ఇది మీ పర్సనల్ ఒపీనియన్ అంటూ… మీరు పొగతాగుతారా? అని సదరు యాంకర్ కి ప్రశ్న వేసిన విజయ్ కి ఆ యాంకర్ నేను పొగ తాగను... కానీ మీరు వేసిన పోస్టర్స్ మాదిరిగానే ఎవరైనా తమ సినిమాల పోస్టర్స్ పెడితే మీరు ఏం చేస్తారని.. అలాగే మీ సినిమాలో ఎక్కువశాతం వల్గారిటీ మీదే దృష్టి సారించారని అడగగా... దానికి విజయ్ ఏ మాత్రం టెన్షన్ పడకుండా మీకు నచ్చలేదని ఆ సీన్లు తీసేయడం కుదరదు… ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి అనే వ్యక్తి క్యారెక్టర్ అదే... అతనలాగే ప్రవర్తిస్తాడు అంటూ ఎన్నో సినిమాలు చేసేసి తలపండిన హీరోలాగా ఫీలవుతూ జవాబు చెప్పాడు.
మరి తమ సినిమాలో అటువంటి వల్గారిటిని చూపించడం అనేది తప్పు కాదని విజయ్ దేవరకొండ చెప్పకనే చెప్పాడు.. అలాగే మేమేం సినిమాకి వెళ్ళమని మీకు చెప్పలేదు. సినిమా హిట్ అన్నారు కాబట్టే మీరు సినిమా చూస్తున్నారంటూ కాస్త గర్వం... పొగరుతో కూడిన సమాధానాలు చెప్పాడు.