Advertisementt

విజయ్ దేవరకొండ టార్గెట్ డిసెంబర్..!

Fri 01st Sep 2017 04:56 PM
rahul sankrityayan,arjun reddy,vijay devarakonda,vijay devarakonda movie updates  విజయ్ దేవరకొండ టార్గెట్ డిసెంబర్..!
Arjun Reddy After Vijay Devarakonda Movie Updates విజయ్ దేవరకొండ టార్గెట్ డిసెంబర్..!
Advertisement
Ads by CJ

'అర్జున్ రెడ్డి' హిట్ తో టాలీవుడ్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరో విజయ్ దేవరకొండ పేరు మార్మోగిపోతోంది. సినిమాలో విజయ్ నటనకు ఎంతటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయో.. అలాగే సినిమాలో ఉన్న వల్గారిటీ మీద కూడా అంతటి నెగెటివ్ కామెంట్స్ పడుతున్నాయి. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్కసారిగా విజయ్ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. యువత ఎక్కడ చూసినా ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' కేరెక్టర్ చేసిన విజయ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఇంతటి విజయంలోనూ 'అర్జున్ రెడ్డి' కి సమస్యలు వచ్చిపడుతూనే ఉన్నాయి.

'అర్జున్ రెడ్డి' సినిమాతో యువత పాడవుతుందని వీహెచ్ అంటుంటే... యువత ఇలానే ఇష్టపడతారు... ఐ డోంట్ కేర్ అంటూ విజయ్ తో పాటే రామ్ గోపాల్ వర్మ కూడా రెచ్చిపోతున్నారు. ఇకపోతే 'అర్జున్ రెడ్డి' విజయంతో ఓవర్ నైట్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరి డైరెక్షన్ లో చేస్తున్నాడో అంటూ అప్పుడే చర్చ ప్రారంభించేశారు. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటున్నారు.  సైలెంట్‌గా షూటింగ్ జరుగుతున్న ఈ ప్రాజెక్టు.. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతోందని చెబుతున్నారు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ లుక్ అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు. దసరా పండక్కి ఆ చిత్రం ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ని కూడా విడుదల చేస్తారనే టాక్ వుంది. మరి ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' తో రచ్చ చేస్తున్న విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ చిత్రంతో డిసెంబర్ లో సందడి చెయ్యనున్నాడంటున్నారు. అలాగే విజయ్ గీతా ఆర్ట్స్‌లో కూడా ఒక మూవీ చేస్తున్నాడు. ఆ చిత్రం గురించి కూడా  త్వరలో డిటైల్స్ తెలుస్తాయంటున్నారు.

Arjun Reddy After Vijay Devarakonda Movie Updates:

Arjun Reddy Hero Vijay Devarakonda Next Movie in Rahul Sankrityayan direction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ