పవన్ కళ్యాణ్ ని ఏదో అన్నాడని.. నటుడు, క్రిటిక్ అయిన కత్తి మహేష్ ని బెదిరిస్తూ, గత కొన్ని రోజులుగా అతనికి టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు. ఓకే, కత్తి మహేష్ ఏదో బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక పబ్లిసిటీ కోసమే పవన్ ని కెలికి ఉంటాడని భావించవచ్చు. బిగ్ బాస్ ని క్యాష్ చేసుకుని..కొంతకాలం పాటు మీడియా లో మంచి అండర్ స్టాండింగ్ సంపాదించడం కోసమే కత్తి అలా ప్రవర్తించి ఉంటాడు. ఆయన నిజంగా దానికోసం చేయకపోయినా..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసి కత్తికి కావాల్సినంత పబ్లిసిటీ ఇచ్చారు.
ఓకే, ఇదంతా బాగానే వుంది, మెగా ఫ్యామిలీ లో ఎవరినైనా ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు కదా ఫ్యాన్స్. మరిప్పుడు నందమూరి బాలకృష్ణ తన సినిమా ప్రమోషన్ కోసం.. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అమితాబ్, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకారంటూ వీర లెవల్లో స్పీచ్ దంచాడు. బ్లడ్, బ్రీడ్ అంటూ..రాజకీయాలేవో తమ ఇంటిలో పట్టు పరుపులు అన్నట్టు మాట్లాడాడు.
మరి కత్తి ని తమ ఇంట్లోని వారు కూడా గుర్తు పట్టనట్లుగా నరుకుతాం అని బెదిరించారు. మరి ఇప్పుడు బాలయ్య కూడా మెగా ఫ్యామిలీ హెడ్ పై డైరెక్ట్ గా దాడి చేశాడు. దమ్ముంటే బాలయ్యని టచ్ చేయండి. చట్టాలు బలమైన వారిపై ఒకలా, బలహీనమైన వారిపై మరోలా ప్రయోగించబడతాయి అని పవన్ అన్నట్లుగా..కత్తి అంటే ఏం చేయలేడనేగా..ఓ ఎక్కేశారు. మరి ఇప్పుడు చూపండి మీలో వున్న అభిమానం ఏంటో, ఎంతో..!