Advertisementt

హీరో క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఏడ్చేసింది!

Fri 01st Sep 2017 11:01 AM
kangana ranaut,bollywood,hrithik roshan,apology  హీరో క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఏడ్చేసింది!
Kangana Ranaut demands APOLOGY from Hrithik Roshan హీరో క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఏడ్చేసింది!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్‌, కంగనా రనౌత్‌ ల వివాదం.. గతేడాది రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే. ‘క్రిష్‌ 3’ మూవీ షూటింగ్ లో  హృతిక్‌, కంగనాలు ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని విపరీతంగా టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులకే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని, ప్రేమ, పెళ్లి మాటలకూ స్వస్తి పలికారు. 

అయితే అప్పటినుండి వీరి కోల్డ్ వార్ జరుగుతూనే వుంది. హృతిక్‌ను ‘సిల్లీ ఎక్స్‌’ అంటూ కంగనా తీసేయడంతో..హృతిక్ కూడా కంగనాకు వీలైనప్పుడల్లా షాక్ ఇస్తూనే వున్నాడు. కంగనా ఇంకా నాకు మెయిల్స్ పంపుతూనే ఉందని, కంగనా క్యారెక్టర్ ని బ్యాడ్ చేసే ప్రయత్నం హృతిక్ చేస్తే, అంతలేదంటూ కంగనా సీరియస్ గా హృతిక్ కి నోటీసులు కూడా పంపింది. అయితే బాలీవుడ్ లోని కొందరు పెద్దలు ఈ వివాదం ని పెద్దది కాకుండా ఇద్దరికీ సర్ది చెప్పి ఎవరి పని వారు చేసుకోండి. ఒకరిది ఇంకొకరు పట్టించు కోవద్దు అంటూ గట్టిగా చెప్పడంతో..కొన్నాళ్లుగా వీరిద్దరూ కామ్ గానే వున్నారు.  

మరి మళ్లీ ఈ విషయాన్ని పెద్దది చేస్తుంది కంగనా. హృతిక్ ని మర్చి పోలేక పోతుందో లేక తన ఇగో శాటిస్పై అవ్వలేదు గానీ, హృతిక్‌ తనని అవమానించాడని అందుకు అతను క్షమాపణ చెప్పాలని కంగనా మళ్లీ విషయాన్ని తోడింది. కంగనా నటించిన ‘సిమ్రన్‌’ చిత్ర పబ్లిసిటీ కోసం తాజాగా ‘ఆప్‌ కా అదాలత్‌’ అనే టీవీ షోలో పాల్గొంది కంగనా. ఈ షో లోనే కంగనా బరస్ట్ అయ్యింది. ‘అతన్ని ఇక్కడికే పిలిచి ప్రశ్నించండి. నలుగురిలో నన్ను అవమానించాడు. తట్టుకోలేకపోయాను. రాత్రిళ్లు ఎంతో ఏడ్చేదాన్ని. ఇందుకు హృతిక్‌ నాకు క్షమాపణ చెప్పాలి’ అని తీవ్ర ఉద్వేగానికి లోనైంది. 

మరి ఇంతకాలం కామ్ గా వున్నా కంగనా..ఇప్పుడెందుకు ఈ విషయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ‘సిమ్రన్‌’ మైలేజ్ పెంచి, అందర్నీ అటెన్షన్ లో పెట్టేందుకా? లేక నిజంగానే కంగనా కుమిలిపోతుందా..! ఏమో అంతా ఆ పై వాడికే తెలియాలి.  

Kangana Ranaut demands APOLOGY from Hrithik Roshan:

Kangana Ranaut, the sizzling hot Bollywood babe, who had claimed to be in a relationship with handsome hunk Hrithik Roshan, has now demanded an apology from him for causing mental and emotional trauma to her by releasing her personal emails, which are still being googled and read like a gossip magazine.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ