బాలకృష్ణ, బోయపాటిని అవాయిడ్ చేస్తున్నా గాని బోయపాటి మాత్రం బాలకృష్ణ నే అంటిపెట్టుకు తిరుగుతున్నాడనే టాక్ ఉంది. బోయపాటితో 'లెజెండ్' వంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ మరోమారు బోయపాటి డైరెక్షన్ లో నటిస్తాడనుకున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం బోయపాటి శ్రీను ని పక్కన పెట్టేసి క్రిష్ తో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చేసేశాడు. అలాగే ఇప్పుడు కూడా తాజాగా పూరి తో 101 వ చిత్రం 'పైసా వసూల్' చేశాక అయినా బోయపాటికి ఛాన్స్ ఇస్తాడేమో అనుకుంటే.. మళ్ళీ 102 వ చిత్రాన్ని కూడా ఏ ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో మొదలెట్టేశాడు. అలాగే తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ గా వుంటుందనే సంకేతాలు ఇస్తున్నాడు.
మరి నిజంగానే బోయపాటిని బాలకృష్ణ అవాయిడ్ చేస్తున్నాడనుకునేలా ఇప్పుడు మరొక సంఘటన జరిగింది. అదేమిటంటే బాలకృష్ణ కి 'సింహ, లెజెండ్' వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి, బాలకృష్ణ కెరీర్ ని ఆ రెండు సినిమాల్తో ఒక గాడిన పడేలా చేశాడనేది జగమెరిగిన సత్యం. ఆ సినిమాల తర్వాత బాలయ్య అంటే బోయపాటే అని కూడా అందరూ ఫిక్సయ్యారు. మరి అలాంటి రెండు సినిమాలకు తన టాప్ 5 సినిమాల జాబితాలో చోటివ్వలేదు బాలయ్య బాబు. తన కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఉన్నాయి అంటే అవి తన మొదటి సినిమా 'తాతమ్మకల, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, శ్రీరామరాజ్యం' అని చెప్పాడే గాని ఎక్కడా 'లెజెండ్, సింహా'ల పేర్లు చెప్పలేదు. మరి ఆ ఐదు సినిమాలే తన కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటూ బోయపాటి పరువు తీసేశాడు.
మరి ఈ లెక్కన బోయపాటికి మళ్ళీ బాలయ్య ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది అంటే కష్టమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు. బాలయ్య కోసం వెయిట్ చేసి చేసి చివరికి బెల్లంకొండ శ్రీవినివాస్ వంటి హీరోకి కమిట్ అయిన బోయపాటి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ తోగాని, మహేష్ తో గాని, చిరు తో గాని చేయాలనుకుంటున్నాడు. చూద్దాం బోయపాటితో ఏ హీరో కమిట్ అవుతాడో?