తనదైన ఊరమాస్ చిత్రాలను తీయడంలో బి.గోపాల్, వినాయక్‌లను కూడా బోయపాటి శ్రీను మించిపోతున్నాడు. 'భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయక'లతో ఊపు మీదున్నాడు. ఇక ఆయన తీసిన ఒకే ఒక్క చిత్రం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రం మాత్రమే ఆడలేదు. అది తప్ప ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు తీసిన చిత్రాలన్ని విజయం సాధించాయి. తనదైన స్టైల్ని, మేకింగ్‌ని ఆయన నిరూపించుకున్నాడు. పెద్దగా కథా బలం లేకపోయినా 'సరైనోడు, జయజానకి నాయక'లతో సత్తా చాటాడు. బన్నీని గతంలో ఎవరూ చూపించని విధంగా బోయపాటి ఎంతో పీక్స్‌లో హీరోయిజం చూపించాడు. అది ఆశ్యర్యపరచకపోయినా ఆయన బెల్లకొండ సాయిశ్రీనివాస్ వంటి పెద్దగా మాస్ ఇమేజ్ లేని, పెద్దగా ఫాలోయింగ్ లేని హీరోతో 'జయ జానకి నాయక' చిత్రం తీసిన తీరుని మాత్రం విశ్లేషకులు బాగా ప్రశంసించారు.
ఈ చిత్రం చూసిన చిరంజీవి, బాలకృష్ణ, అల్లుఅర్జున్, అల్లుఅరవింద్ ఇలా అందరూ ఆయన తీసిన తీరుని బాగా మెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన తన చేతిలో మూడు కథలు ఉన్నాయని, అవి చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబుల కోసమని ప్రకటించాడు. చిరంజీవి ప్రస్తుతం చారిత్రక, హై గ్రాఫికల్ చిత్రంగా భారీ కాన్వాస్‌పై 'సై..రా.. నరసింహారెడ్డి' చిత్రం తీస్తున్నాడు. ఈమూవీలో వివిధ భాషలకి చెందిన మహామహులు నటిస్తుండటంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయి, విడుదలయ్యేందుకు వచ్చే ఏడాది ద్వితీయార్ధం దాటేలా కనిపిస్తోంది. మరోవైపు మహేష్ 'స్పైడర్, భరత్ అనే నేను', దిల్‌రాజు- అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బిజీబిజీ. కాబట్టి ఆయన ఫ్రీ కావడానికి కూడా చాలా సమయం పట్టనుంది. మరోవైపు బాలయ్య ప్రస్తుతం కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో తన 102వ చిత్రం చేస్తున్నాడు. దాంతో బాలయ్యతో చేసే సినిమా వచ్చే జూన్ నుంచి ఉండవచ్చని బోయపాటి చెప్పాడు. దీంతో ఈ గ్యాప్‌లో వచ్చిన 10నెలల కాలంలో బోయపాటి మరే హీరోతో చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతానికి అందరు స్టార్స్ సినిమాలతో బిజీ. బోయపాటితో అఖిల్ చిత్రం ఉందని ప్రచారం జరిగినా నాగ్ దానిని కొట్టిపడేశాడు. ఇక మిగిలింది ఇద్దరు స్టార్సే, వారే మెగా హీరోలైన పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్. పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ కల్లా పూర్తయి వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇక రామ్‌చరణ్-సుకుమర్‌ల 'రంగస్థలం 1985' వచ్చే సమ్మర్‌లో విడుదల అవుతుంది. షూటింగ్ మాత్రం ఫిబ్రవరిలోనే పూర్తవుతుందని అంటున్నారు. పవన్, చరణ్‌ల తదుపరి చిత్రాలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. సుకుమార్ తర్వాత చరణ్ ఎవరితో చేస్తాడా? మహేష్ మరియు కొరటాల ఫిల్మ్ షూటింగ్ అయిన తర్వాత చరణ్ తోనే అని రీసెంట్గా ఆఫీషియల్ న్యూస్ వదిలారు. సో, చరణ్ కూడా బిజీ అనే అనుకోవాలి. అయితే త్రివిక్రమ్ తర్వాత పవన్ ఎవరితో చేస్తాడా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. పవన్ అక్టోబర్ నుంచి ప్రత్యక్ష్య రాజకీయాలలోకి వస్తానని, సినిమాలైనా వదులుకుంటానని చెప్పాడు. కానీ ఎన్నికలలో కావల్సిన ఆర్ధిక స్థోమత దృష్ట్యా ఆయన మరలా మనసు మార్చకున్నాడని వార్తలు వచ్చాయి.
ఇక ఆయన ఎ.యం.రత్నంకి కాకుండా మైత్రిమూవీ మేకర్స్‌కి సంతోష్ శ్రీనివాస్‌తో చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చినా ఇప్పుడు మాత్రం మైత్రిమూవీ మేకర్స్‌తో పవన్ చేయబోయే చిత్రం బోయపాటితో ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే సంక్రాంతి లోపు బోయపాటి పవన్‌కి కథ రెడీ చేసి సంక్రాంతి నుంచి వచ్చే జూన్‌లో బాలయ్య చిత్రం మొదలయ్యే సమయానికి పూర్తి చేస్తాడనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో లాజిక్ కూడా ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని కొట్టిపారేయలేం అని చెప్పాలి...!