Advertisementt

కాపీ క్యాట్: బాబీ, రాజమౌళిని మించేశాడా?

Thu 31st Aug 2017 04:56 PM
the good the bad the weird,jai lava kusa,jr ntr,kalyan ram,bobby  కాపీ క్యాట్: బాబీ, రాజమౌళిని మించేశాడా?
Jai Lava Kusa Copy From The Good The Bad The Weird కాపీ క్యాట్: బాబీ, రాజమౌళిని మించేశాడా?
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రాన్ని డైరెక్టర్ బాబీ, కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఎప్పటినుండో 'జై లవ కుశ' ప్రమోషన్ మొదలెట్టిన చిత్ర టీమ్ ఇప్పుడు వాటిని వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 'జై, లవ, కుశ' లుక్స్ తో అలరించిన 'జై లవ కుశ' ఇప్పుడు పాటలతో సందడి చెయ్యడానికి రెడీ కూడా అయ్యింది. సెప్టెంబర్ 3 న 'జై లవ కుశ' పాటలని నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. అలాగే చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం గ్రాండ్ గా హైద్రాబాద్లోనే నిర్వహించబోతున్నారు.

ఎన్నో అంచనాల మధ్యన తెరకెక్కతున్న 'జై లవ కుశ' చిత్రానికి సంబందించిన ఒక న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. డైరెక్టర్ బాబీ, రాజమౌళిలా 'జై లవ కుశ' చిత్రాన్ని వేరొక చిత్రం నుండి కాపీ కొట్టాడనే న్యూస్ సోషల్ మీడియాలో గుప్పుమంది. రాజమౌళి హాలీవుడ్ మూవీస్ లోని కొన్ని సీన్స్ ని కాపీ చేసి తన సినిమాల్లో వాడతాడని మొదటి నుండి ప్రచారంలో ఉన్న న్యూస్. ఇప్పుడు బాబీ కూడా ఒక సౌత్ కొరియన్ మూవీ 'ది గుడ్ - ది బ్యాడ్ - ది వియర్డ్' అనే చిత్ర థీమ్ ను ఆధారంగా చేసుకుని ఈ 'జై లవ కుశ' చిత్రంలోని పాత్రలకి ప్రాణం పోశాడట. ది గుడ్ ని లవ కుమార్ గా, ది బ్యాడ్ ని జై గా, ది వియర్డ్ ని కుశ గా క్రియేట్ చేశాడట. మరి ఒక పాత సౌత్ కొరియన్ మూవీని డైరెక్టర్ బాబీ కొత్త హంగులతో మనకి 'జై లవ కుశ'గా చూపించబోతున్నాడనే న్యూస్ హాట్ హాట్ గా సర్క్యులేట్ అవుతుంది. 

అయితే ఈ విషయం నిజమో కాదో కరెక్ట్ గా తెలియదు గాని ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అలాగే కాపీ చెయ్యడంలో డైరెక్టర్ బాబీ, రాజమౌళిని మించిపోతాడా? అనే కామెంట్స్ కూడా పడిపోతున్నాయి. అయితే ఇదేమి నిజం కాదని డైరెక్టర్ బాబీ ఫ్రెష్ కథతో 'జై లవ కుశ' ని తెరకెక్కిస్తున్నట్లు ఎన్టీఆర్ ఫాన్స్ వాదిస్తున్నారు. ఇకపోతే 'జై లవ కుశ'లో ఎన్టీఆర్ కి జోడిగా రాశి ఖన్నా, నివేత థామస్ లు నటిస్తున్నారు. 

Jai Lava Kusa Copy From The Good The Bad The Weird:

Director Bobby copied The Good The Bad The Weird for Jai Lava Kusa 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ