తెలుగు సినిమాలలో సీనియర్ స్టార్స్ యంగ్ హీరోలతో కలిసి నటించడానికి వెంకటేష్ నాంది పలికాడు. అలా ఆయన మహేష్‌బాబుతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్‌తో 'మసాలా', పవన్‌తో 'గోపాల గోపాల' చిత్రాలనే కాదు.. కమల్‌హాసన్‌తో కలిసి 'ఈనాడు' చిత్రాలు చేశాడు. ఇక ఆయన త్వరలో తమిళ హిట్ మూవీ 'విక్రమ్‌వేద'లో రానా దగ్గుబాటితో కలిసి నటిస్తాడని వార్తలు వచ్చాయి.
అయినా వెంకీ 'గురు' విడుదలై ఇంతకాలం గడుస్తున్నా ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ గురించి నోరు విప్పలేదు. ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేసే మినిమం గ్యారంటీ ఉండి, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వెంకీ ఇంత గ్యాప్ తీసుకోవడంంపై పరిశ్రమ వర్గాల్లో కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఎట్టకేలకు వెంకటేష్ నటించే చిత్రంపై ఓ క్లారిటీ వచ్చింది. త్వరలో ఆయన మరో యంగ్‌హీరోతో కలిసి ఓ మల్టీ మూవీ చేయనున్నాడు.
ఇందులో యంగ్ హీరోగా 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ విజయ్ దేవరకొండ వెంకటేష్‌తో కలసి నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్‌తో కలసి నటించేందుకు 'అర్జున్‌రెడ్డి' కంటే ముందే విజయ్ దేవవకొండ ఓకే చెప్పాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్‌ని మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించనున్నాడు.
మొత్తానికి వెంకీతో.. 'అర్జున్‌రెడ్డి'తో సెన్సేషన్ సాధించి, యూత్ ఐకాన్‌గా మారిన విజయ్‌దేవరకొండ కలసి నటించడమంటే ఈ మూవీకి ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరగడం ఖాయమనే చెప్పాలి.