సుమ, ఝాన్సీ వంటి వారు ఏదైనా టీవీ షోస్ నిర్వహించినా కట్టు బొట్టు, తమ మాటలు అన్ని సంప్రదాయంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వారు హోస్ట్ చేసే షోలని కుటుంబ సమేతంగా చూడవచ్చనే గుడ్ విల్ వారికి ఉందని ఆడియన్స్ భావిస్తారు. ఇక వీరు కూడా వెండితెరపై నటించిన వారే. కానీ ప్రస్తుతం ఉన్న అనసూయ, రేష్మి, శ్రీముఖిలను చూస్తే వారు మంచి వాక్చాతుర్యం, స్పాంటేనియస్‌గా సంపాదించే వారే. కానీ వారు అతి పొట్టి, అర్ధనగ్న దుస్తులు, ఎక్స్‌పోజింగ్‌లతో బుల్లితెరపై కనిపిస్తూ ఉంటారు. వీటిని ఓ వర్గం వీక్షకులు ఆదరిస్తున్నారా? కుటుంబ సమేతంగా, వయసుకి వచ్చిన పిల్లలతో కలిసి వీరి షోలను కొందరు చూడలేకపోతున్నారు.
సినిమాలలో నటించి, బుల్లితెరకు వచ్చి, మరలా వెండితెరపై అవకాశాల కోసమే వారు ఇలా అసభ్య పదజాలాలు, దుస్తులు, గ్లామర్‌షోలు చేస్తున్నారని సంప్రదాయవాదులు భావిస్తున్నారు. విషయానికి వస్తే ఓ టీవీ షోలో అనసూయ చేస్తున్న ఎక్స్‌పోజింగ్, గ్లామర్‌షోలను చూసి అనసూయని ఉద్దేశించి మాకు మీ కార్యక్రమాలు చూడాలని ఉన్నా.. ఆ దుస్తులు, గ్లామర్‌షోల కారణంగా కుటుంబ సమేతంగా చూడలేకపోతున్నామనే ఆవేదనతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనసూయకి కామెంట్ చేశాడు ఓ వ్యక్తి. అంతే ఆ వ్యక్తికి సమాధానంగా అనసూయ, ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్నది నా ఇష్టం. నీకు నచ్చకుంటే నువ్వు చూడకు. ఇతరుల విషయాలలో తల దూర్చకుండా నీ పని నువ్వు చూసుకుంటే మంచిది... అని అనసూయ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే.. ఆయన పలానా దుస్తులే వేయండి అని అనసూయని డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేసే హక్కు కూడా ఆయనకు లేదు. కానీ ఆయన కేవలం తన అభిప్రాయం చెప్పి, ఇది సినిమా కాదు కదా...! బుల్లితెర కాబట్టి ఫ్యామిలీ అందరూ చూస్తారు కాబట్టి కాస్త దుస్తులు, వేషభాషలలో సంప్రదాయంగా ఉండాలని మాత్రమే సూచించాడు. దానిపై అనసూయ అంత ఘాటుగా స్పందించడం సమంజసం కాదేమో?
ఒక్క వ్యక్తిని కాబట్టి ఇష్టం లేకపోతే చూడకు అంది. ప్రతి ఒక్కరిని చూడకపోతే పో.... అంటే, గడ్డిపోచ గడ్డిపోచ ఒకటై చివరకు ఏనుగుని బంధించే తాడు టైప్‌లో అనసూయ షోలకి అసలు ప్రేక్షకులే ఉండరు. ఏదైనా ఆమె రిప్లై చేయదలుచుకుంటే కాస్త పద్దతిగా స్పందించాలి గానీ ఇలా ప్రవర్తిస్తే మాత్రం ఈ అమ్మడిని ఆమె మానానికి ఆమెను అందరు వదిలేయడం ఖాయం....!