ఎప్పుడో టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్‌రాజ్ కుమార్ తన స్నేహితునితో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన 'ఇష్టం' చిత్రం ద్వారా శ్రియ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి తదనంతర కాలంలో అక్కినేని కాంపౌండ్‌కి చెందిన యార్లగడ్డ సుప్రియను వివాహం చేసుకుని మరణించాడు కూడా. ఇక విషయానికి వస్తే శ్రియాశరన్ ఇంతకాలం గడిచినా తన సత్తాను చాటుతూనే ప్రేక్షకుల చేత నువ్వంటే 'ఇష్టం' అనిపిస్తోంది. ఈమె వయసు ప్రస్తుతం 34 ఏళ్లు. అయినా ఇటీవల జరిగిన 'పైసా వసూల్' వేడుకకి క్లీవేజ్ షోతో వచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.
తెలుగులోని సీనియర్‌స్టార్స్, యంగ్ స్టార్స్ అనే బేధం లేకుండా అందరితోనూ హీరోయిన్‌గా జోడీ కట్టడం ఈమెకే సాధ్యమైంది. ఇక సెప్టెంబర్ 1న విడుదల కానున్న పూరీ జగన్నాధ్- బాలకృష్ణల 'పైసా వసూల్' చిత్రంలో ఆమె మరోసారి బాలయ్యతో కలిసి నటిస్తోంది. గతంలో ఈమె బాలకృష్ణ సరసన 'చెన్నకేశవరెడ్డి'తో పాటు బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి'లో నటించి, ఆ వెంటనే బాలయ్య 101వ చిత్రంలో చాన్స్ కొట్టేసింది. ఇక ఈమె మంచి పారితోషికం ఇస్తే ఐటం సాంగ్స్‌కి కూడా ఓకే అంటోంది.
ఇటీవల కృష్ణవంశీ 'నక్షత్రం' చిత్రంలో ఐటం సాంగ్‌లో నటించింది. కానీ వీటిని ఐటం సాంగ్స్ అనవద్దని, స్పెషల్ సాంగ్స్ అనాలని ఆమె కోరుతోంది. కాగా 'పైసావసూల్'లో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తుండగా, శ్రియాశరన్ జర్నలిస్ట్ పాత్రను చేస్తోంది. ఈ చిత్రం ద్వారా పూరీ జగన్నాథ్‌తో పనిచేయడం ఆనందం కలిగించింది అంటూనే తాను ఒకప్పుడు డబ్బుల కోసం చేసిన సినిమాలు కూడా ఉన్నాయని, కానీ ఇప్పుడు అలా చేయడం లేదని తెలిపింది.
పలువురు తాను ఎక్కువగా సినిమాలు చేయకుండా సెలక్టివ్‌గా పాత్రలు చేస్తుండటంతో శ్రియాకి అవకాశాలు తగ్గాయని అంటున్నారని, కానీ తాను ఈ విషయాలను పట్టించుకోనని తెలపింది. తాను కొంతకాలం కిందట ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల పేరుతో ఆడవాళ్లని కించపరుస్తూ, నల్లగా ఉన్నప్పుడు పెళ్లిళ్లు కాక వారి ఫెయిన్‌నెస్ క్రీమ్‌లు వాడి తెల్లగా మారిన తర్వాతే పెళ్లిళ్లు అవుతున్నట్లు చూపిస్తున్నారని, దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిసింది. ఇక లేడీ ఓరియంటెడ్ పాత్రలకు నేనే సరిపోను.. సినిమా ఏదైనా మంచి పాత్ర వస్తే ప్రేక్షుకులు గుర్తుపెట్టుకుంటారని, కానీ కేవలం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడం వల్లే ప్రేక్షకులు ఆదరిస్తారనే దానిని తాను అంగీకరించనని తెలిపిన ఆమె అసలు తనవరకు ఇప్పటివరకు లేడీ ఓరియంటెడ్ కథలే రాలేదని తేల్చిచెప్పింది.
ప్రస్తుతం 'వీరభోగ వసంతరాయులు' చిత్రంలో పోలీస్‌గా నటిస్తున్నానని, తన పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకే వదిలేశానని, కానీ పెళ్లయిన తర్వాత నటించకూడదని, ఫ్యామిలీకే సమయం కేటాయించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.