Advertisementt

హీరో నిఖిల్ పెళ్లి ఆపేసిందెవరు..?

Wed 30th Aug 2017 06:17 PM
nikhil,nikhil siddharth,horoscopes,tejaswini  హీరో నిఖిల్ పెళ్లి ఆపేసిందెవరు..?
Young Hero Nikhil Marriage Canceled హీరో నిఖిల్ పెళ్లి ఆపేసిందెవరు..?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. 'స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, కేశవ' వంటి చిత్రాలతో దూసుకుపోతున్న నిఖిల్ తాజాగా 'కిరాక్ పార్టీ' రీమేక్ లో నటించడానికి సిద్దమవుతున్నాడు. మరోపక్క నిఖిల్ పెళ్లి చేసుకుబోతున్నాడనే న్యూస్ కూడా వచ్చింది. ఒక పక్క సినిమాలతో బిజీగా వున్న నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడని... పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకోబోతున్నాడనే న్యూస్ గత నెలలో ప్రచారం జరిగింది.

హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె తేజస్వినిని నిఖిల్ పెళ్లాడబోతున్నాడని అన్నారు. తేజస్విని కూడా నిఖిల్ కు రెలిటివ్స్ కావడంతో ఈ పెళ్లి మాటలు జరిగాయని అన్నారు. అలాగే ఆగష్టు 24 న ఎంగేజ్మెంట్ చేసుకుని అక్టోబర్ 1 వ తేదీన పెళ్లి కూడా నిశ్చయమైందనే న్యూస్ కూడా వచ్చింది. ఇక ఎంగేజ్మెంట్ ని కేవలం కుటుంబ సభ్యుల మధ్యన చేసుకున్నా కూడా పెళ్ళికి మాత్రం ఇండస్ట్రీలో ప్రముఖులను... స్నేహితుల మధ్యలో గ్రాండ్ లెవల్లో చేసుకోవాలని నిఖిల్ అనుకున్నాడని... ఆ పెళ్లిపనుల్లోనే నిమగ్నమైనట్టు కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు సడన్ గా నిఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయినట్టుగా చెబుతున్నారు. తేజస్వినితో నిఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని అలాగే ఆగష్టు 24  న జరగాల్సిన నిఖిల్ - తేజస్వినిల ఎంగేజ్మెంట్ కూడా జరగలేదని అంటున్నారు. అయితే నిఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవడానికి కారణం మాత్రం వధువు, వరుడు జాతకాలు కలవలేదనేది కారణంగా చెబుతున్నారు. ఇక అక్టోబర్ 1 జరగాల్సిన నిఖిల్ పెళ్లి జాతకాల కారణంగా క్యాన్సిల్ అయిన విషయం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కిరాక్ పార్టీ రీమేక్ కోసం సన్నద్ధమవుతున్నాడు.

Young Hero Nikhil Marriage Canceled:

Nikhil was supposed to get engaged with Tejaswini, who reportedly is his relative and the daughter of noted businessman Anjaneyulu Yadav from Hyderabad.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ