మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన 'జయ జానకి నాయక' చిత్రం హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆగష్టు 11 బరిలో 'నేనే రాజు నేనే మంత్రి, లై' లకు గట్టి పోటీ ఇచ్చి ఈ చిత్రం నిర్మాతలను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది. అలా ఈ చిత్రం రెండు చిత్రాల పోటీని ఎదుర్కొని ఇలా నిలబడగలిగింది అంటే అది కేవలం బోయపాటి మార్క్ మాత్రమే అని ఢంకా భజాయించి మరి చెబుతారు. అయితే ఈ 'జయ జానకి నాయక' సినిమా గనక సోలోగా వచ్చి ఉంటే బంపర్ హిట్ అవడమే కాదు భారీ కలెక్షన్స్ కొల్లగొట్టేది. అసలు ఆగష్టు 11 న ఈ సినిమాకి సరైన థియేటర్స్ దొరకక మాత్రమే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించలేకపోయింది.
అయితే అన్నిటిని తట్టుకుని ఈసినిమా నిలబడింది అంటే అది కేవలం బోయపాటి వల్లే. మరి 'సరైనోడు', తర్వాత మరో విజయాన్ని కూడా లిస్ట్ లో వేసుకున్న బోయపాటి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చిరుతో చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన కొడుకు రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలనుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది. చరణ్ తో చేసే సినిమా విషయంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ కు బోయపాటి రావడమే కాదు...... ఇప్పటికే స్టోరీ కూడా సిద్ధమైపోయిందనే టాక్ వినబడుతుంది. ఇక చరణ్ - బోయపాటి కాంబో పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతుంది.
అయితే చరణ్ - బోయపాటి కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని రామ్ చరణ్ మామ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్లు కూడా చెబుతున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'సరైనోడు' వంటి హిట్ ఉండడం, అలాగే చరణ్ - బోయపాటి కాంబినేషన్ కొత్తగా ఉండడంతో... అప్పుడే ఈ సినిమాపై అందరూ ఆసక్తి చూపెడుతున్నారు. మరి ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో 'రంగస్థలం'లో నటిస్తున్న చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బోయపాటితో చేస్తాడా? లేకుంటే కొరటాలకు కమిట్ అవుతాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.