అర్జున్ రెడ్డి సినిమా ప్రచారం కోసమే అన్ని చేస్తున్నాడా అనే తరహాలో కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు చేస్తున్న పనులున్నాయి. సినిమా రిలీజ్ కి ముందు పోస్టర్స్ చింపి, పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తో దూసుకుపోతుంటే..ఎక్కడ కలెక్షన్స్ తగ్గుతాయో అని మళ్లీ గొడవ మొదలెట్టాడు. దీంతో ఆయన అనుకుంటున్నది రివర్స్ అయ్యి సినిమాకి ప్లస్ అవుతుంది. తాజాగా వి హెచ్, కేటీఆర్, రాజమౌళి మొదలగు వారు సినిమాకి ఇచ్చిన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ పై విరుచుకు పడ్డాడు. ఈ సినిమా గురించి అకున్ సబర్వాల్ కి కంప్లైంట్ చేస్తానంటూ మీడియా ముఖంగా రెచ్చిపోవటంతో..మరోసారి తాతయ్య కి విజయ్ దేవరకొండ తన పేస్ బుక్ పేజీ లో కౌంటర్ వేసే ప్రయత్నం చేశాడు.
తాతయ్యా.. ఛిల్ అంటూ మరోసారి విజయ్ దేవరకొండ పై విధంగా వి హెచ్ పై ఫైట్ కి దిగాడు.