రోజులు పెరిగే కొద్ది ముసలి ఛాయలు రావడం ప్రకృతి సహజం, ఇక జుట్టు ఊడిపోయి బట్టతల కూడా కామనే. కానీ మన స్టార్స్ మాత్రం వాటిపైనే ఎక్కువగా శ్రద్ద చూపుతారు. రజనీకాంత్ అంత స్టార్ అయినా ఆయన షూటింగ్ లేని సమయాలల్లో, ఫంక్షన్లలో చెదిరిన బట్టతల, పెరిగిన తెల్ల గడ్డంతో చింపిరి చింపిరిగా కనిపిస్తాడు. అదేంటి అలా ఉంటే ఎలా? అభిమానులు ఫీలవుతారు? కదా అంటే నేనే ఫీల్ కానప్పుడు అభిమానులు బాధపడటంలో అర్ధం లేదు. దేవుడిచ్చిన ఈ 68 ఏళ్ల వయసులో, తాతయ్య వయసులో ఎవరైనా ఇలాగే ఉంటారు. ఇక అభిమానం అంటారా? నన్ను చూడండి, నేను తెల్ల బట్ట తలతో, చింపిరి తెల్లని గడ్డంతో కనిపించినంత మాత్రాన నాకున్న క్రేజ్ ఎక్కడికీ పోదు అని చెబుతాడు.
కొందరు పెద్దతనాన్ని ఎంతగా ద్వేషిస్తారంటే శోభన్‌బాబు తన చివరి రోజుల్లో తన ఒకప్పటి అందం ఇప్పుడు లేదని, తాను బయటకి వెళ్తే అందరూ తన గురించే నవ్వుతూ మాట్లాడుకుంటారని, జుట్టు ఊడటం, మొహంలో ముసలి చాయలను ఆయన జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి, ఓరకమైన మానసిక వ్యాధికి గురై డిప్రెషన్‌లో ఉండిపోయారు. ఇక 'సీతారామయ్యగారి మనవరాలు' చిత్రంలో విగ్గు లేకుండా నటించేందుకు దర్శకుడు క్రాంతికుమార్‌ని ఏయన్నార్ ఎన్నో ఇబ్బందులు పెట్టాడు.
ఇక చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబుతో పాటు పలువురికి బట్టతలలు ఉన్నాయి. అయినా ఈ స్టార్స్‌కి బట్టతల అంటే ఒప్పుకోరు. ఎవరైనా ఒరిజినల్ గెటప్‌ని ఫొటో తీయబోతే కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక 'పైసా వసూల్' ఆడియో వేడుక అనంతరం, ఈ చిత్రం యూనిట్ పాల్గొన్న ప్రైవేట్ పార్టీలో విగ్గు లేకుండా, రజినీకాంత్ లా ఒరిజినల్ గా కనిపించి బాలయ్య సెంటర్‌ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇక ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన చార్మి తమ పూరీ కనెక్ట్స్ సంస్థ తరపున సరిగమ కార్విన్ పోర్టబుల్ మ్యూజికల్ ప్లేయర్‌ని ఆమె బాలయ్యకి గిఫ్ట్‌గా ఇచ్చి తమ చిత్రం షూటింగ్‌లో ఎంతో సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది.
ఇక బాలయ్య కూడా ఈచిత్రానికి లైన్ ప్రొద్యూసర్‌గా బాగా పనిచేసి, అనుకున్న విధంగా షూటింగ్ జరగడానికి దోహదపడిన చార్మికి బాలయ్య కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ఈ వేడుకలో పూరీ, ముస్కాన్ సేథీ, కైరా దత్ వంటి వారు కూడా పాల్గొన్నారు. ఇక పూరీ తన చేతుల మీదుగా కాకుండా చార్మి చేతుల మీదుగా గిఫ్ట్ ఇవ్వడంతో పలు సెటైర్లు వినిపిస్తున్నాయి.