Advertisementt

డేరా బాబా అరెస్ట్..గ్రూపుతో హీరోయిన్ అలెర్ట్..!

Wed 30th Aug 2017 01:25 PM
alia bhatt,raazi,gurmeet ram rahim arrest,patiala  డేరా బాబా అరెస్ట్..గ్రూపుతో హీరోయిన్ అలెర్ట్..!
Ram Rahim Arrest affect on Raazi Movie Shooting డేరా బాబా అరెస్ట్..గ్రూపుతో హీరోయిన్ అలెర్ట్..!
Advertisement
Ads by CJ

మనదేశంలో ఏదైనా సరే ఇన్‌స్టెంట్‌గా ఉండాలని కోరుకుంటారు. తాము ప్రత్యక్షంగా దేవునికి తమ బాధలు చెప్పాలని,ఆ బాబా తమ కోరికలను వెంటనే తీర్చాలని, తమ బాధలను ఆయన వెంటనే స్వయంగా వినాలని భావిస్తారు. అందుకే మన దేశంలో సైంటిస్ట్‌ల కంటే బాబాలకే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంటుందని గతంలో ఓ చిత్రంలో త్రివిక్రమ్‌ చెప్పాడు. ఇప్పుడు డేరా బాబా విషయంలోనూ అదే జరుగుతోంది. గతంలో పుట్టపర్తి నుంచి స్వామిజీల కుటీరాలలో చాలా నిషిద్ధ పనులు జరిగేవని భావిస్తారు. 

సినీ నటి రంజిత అయితే సెక్స్‌ చేస్తూనే దొరికిపోయింది. ఇక పిల్లలను పుట్టిస్తామని, కోటీశ్వరులని చేస్తామని, ఎలాంటి రోగాలనైనా మటు మాయం చేస్తామని చెప్పే బాబాలు వీధికొకరు ఉన్నారు. ప్రమాదవశాత్తూ వీరికి మంచి అంగ, అర్ధబలాలు కూడా ఉంటాయి. రాజకీయ నాయకుల నుంచి ఎంతటి వారైనా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. నాటి చంద్రస్వామి నుంచి అందరూ వారి కాళ్లు మొక్కేవారే. 

ఇక డేరా బాబా సంఘటన తర్వాత పంజాబ్‌, హర్యానాలలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఖచ్చితంగా విద్వేషాలు చెలరేగినప్పుడు 'రాజీ' అనే చిత్రం షూటింగ్‌ నిమిత్తం బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ పంజాబ్‌లోని పాటియాలాలో ఉంది. ఇందులో విక్కీకౌశిక్‌ హీరోగా నటిస్తుండగా, మేఘనా గుల్జార్‌ దర్శకుడు. సమాచారం తెలుసుకున్న చిత్ర యూనిట్‌ వెంటనే అప్రమత్తమై యూనిట్‌ అందరూ, చివరకు వారు వాడే బాగా ఖరీదైన ఎక్కిప్‌మెంట్‌ని కూడా హోటళ్లకి తరలించారు. అదే వారికి ఇబ్బందులు లేకుండా చేసింది. 

దాదాపు వారం రోజుల పాటు అలియా భట్ అండ్ యూనిట్ హోటల్ లో బందీ అయ్యారు. బయటికి వద్దామంటే అల్లర్లు, అరాచకాలు జరగడంతో హోటల్ నుండి బయటికి వచ్చే ఛాన్స్ లేదు. యూనిట్‌ మరలా షూటింగ్‌పై చర్చలు జరుపుతున్నారు. నిజానికి సెప్టెంబర్‌ 10 వరకు పాటియాలాలోనే షూటింగ్‌ జరగాలి. మరి ఇప్పుడు వృదా అయిన వారం రోజులను తిరిగి షెడ్యూల్‌ని పొడిగిస్తారా? లేదా?చూడాలి. ఈ షెడ్యూల్‌ తర్వాత నెల రోజుల పాటు చండీగఢ్‌లో షూటింగ్‌, ఆ తర్వాత చివరి షెడ్యూల్‌ని మొదట ముంబైలో ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు షూటింగ్‌కి అవరోధం కలగడంతో యూనిట్‌ ఏమి చేస్తుందో చూడాల్సివుంది...!

Ram Rahim Arrest affect on Raazi Movie Shooting:

Alia Bhatt and the unit of the film Raazi are reportedly confined in a hotel in Patiala after Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim's conviction in rape case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ