సినీ విశ్లేషకుడు, బిగ్‌బాస్ షో ద్వారా సెలబ్రిటీ అయిన మహేష్ కత్తి.. పవన్ కళ్యాణ్ డబ్బులు లేవంటూనే పబ్లిక్ ఫంక్షన్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆడిట్ చూపిస్తారా? అని ప్రశ్నించడంతో పాటు పవన్ నటన, సినిమాల ఎంపిక, రాజకీయాలపై పలు విషయాలలో ఘాటు విమర్శలు చేశాడు. దాంతో పవన్ అభిమానులు కత్తి మహేష్ కి టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు.
దీనిని ఆసరాగా చేసుకుని భజన పరుడైన బండ్లగణేష్ మహేష్‌కత్తిపై ధ్వజమెత్తాడు. 'తమ్ముడు కత్తి మహేష్ ....,సూర్యుడి వైపు చూడకు....,ఆ సూర్య కిరణాల మైన మా లాంటి వారిచే మాడి మసైపోతావు. నీతి..., నిజాయితీ గురించి చెప్పించుకునే అవకాశం పవర్ స్టార్ కు రాదు....,లేదు. సూర్యుడి గురించి ఆయన శక్తి గురించి ఆలోచించే అంత బుర్ర లేదులే ..అందుకే కత్తి అర్హతకి మించి మాట్లాడుతున్నాడు'..అంటూ ట్వీట్లతో బండ్ల చెలరేగిపోయాడు. ఈ ట్వీట్లతో ఆయన ట్రెండ్ సెట్టర్ అయ్యాడంటే..ఎంతలా బండ్ల గణేష్ తన పదునైన మాటలని కత్తిపై ప్రయోగించాడో తెలుసుకోవచ్చు.