Advertisementt

ఈ 'మహానటి' బిజినెస్ మొదలెట్టింది..!

Tue 29th Aug 2017 06:43 PM
savitri,mahanati,overseas rights,keerthi suresh  ఈ 'మహానటి' బిజినెస్ మొదలెట్టింది..!
Mindblowing offer for Mahanati Overseas ఈ 'మహానటి' బిజినెస్ మొదలెట్టింది..!
Advertisement
Ads by CJ

అశ్వినీదత్ అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మహానటి' చిత్రం మొదలు పెట్టినప్పటి నుండి సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ ఎంపిక కాగా... టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఒక కీ రోల్ చేస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన్, జెమినీ గణేశన్ పాత్ర చేస్తుండగా... ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వంటి నటులు కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుండటంతో ఇదొక మినీ మల్టి స్టారర్ చిత్రంలా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమా మొదలుపెట్టి ఇన్ని రోజులు అయినా ఈ సినిమాకి సంబంధించి సావిత్రి లుక్, జెమినీ గణేశన్ లుక్స్ మాత్రమే రివీల్ చేసిన చిత్ర యూనిట్ 'మహానటి' చిత్ర మెయిన్ లుక్ మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న 'మహానటి' చిత్రం గురించి ఎవరెవరు ఆ సినిమాలో నటిస్తున్నారో అనే ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా విషయాలేమి బయటకి రాలేదు. 

అయితే ఎటువంటి లుక్ విడుదల కాకపోయినా... అలాగే ఈ చిత్రం గురించిన ఫుల్ డిటైల్స్ లేకపోయినా.. ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడడమే కాదు మంచి క్రేజ్ కూడా వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకోవడానికి ఎగబడుతున్నారనే అనే టాక్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా 'మహానటి' ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా చెబుతున్నారు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 'మహానటి' ఓవర్సీస్ హక్కులను నిర్వాణ సినిమాస్ వారు ఏకంగా 4.5  కోట్లకు కొనేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి మినీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈ రేంజ్ లో ఓవర్సీస్ హక్కులకు భారీ ధర రావడం విశేషమే అని చెప్పుకోవాలి. దీన్నిబట్టే 'మహానటి' చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలున్నాయి అర్ధమైపోతుంది. 

మరి ఓవర్సీస్ లోనే 'మహానటి' ఈ రేంజ్ ధర పలికితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ  చిత్రం ఇంకే రేంజ్ లో అమ్ముడుపోతుందో అంటున్నారు. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి బ్రహ్మాండమైన ఆఫర్స్ వస్తున్నాయంటున్నారు. మరి మీడియం బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 30 నుండి 40  కోట్ల బిజినెస్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఓవర్సీస్ లో 'మహానటి' రైట్స్ ని కొన్న నిర్వాణ సంస్థ వారు తాజాగా రెండు హిట్ సినిమాలు కొని మంచి లాభాల్లో ఉన్నారు. 'ఆనందో బ్రహ్మ, అర్జున్ రెడ్డి' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నారు వీరు. మరి 'మహానటి'తో వీరు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూద్దాం.

Mindblowing offer for Mahanati Overseas :

Legendary actress Savitri biopic directed by young director Nag Ashwin has become the most interesting project in Tollywood now.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ