Advertisementt

'పైసా వసూల్' ఫస్టాఫ్ జెట్ స్పీడ్‌..సెకండాఫ్..!?

Tue 29th Aug 2017 06:34 PM
balakrishna,paisa vasool,paisa vasool movie,puri jagannadh  'పైసా వసూల్' ఫస్టాఫ్ జెట్ స్పీడ్‌..సెకండాఫ్..!?
What in Balayya Paisa Vasool ? 'పైసా వసూల్' ఫస్టాఫ్ జెట్ స్పీడ్‌..సెకండాఫ్..!?
Advertisement
Ads by CJ

'పైసా వసూల్' చిత్రం రాబోయే శుక్రవారం విడుదల కానుంది. బాలకృష్ణ - పూరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రొజెక్ట్ లో బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ లా కనిపించబోతున్నాడు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత జెట్ స్పీడ్‌లో బాలకృష్ణ చేసిన ఈ మూవీని... పూరీ పక్కా ప్లానింగ్ తో రిలీజ్‌కు రెడీ చేశాడు. ముందు అనుకున్న డేట్ కన్నా నాలుగు వారాల ముందే ఈ సినిమాని థియేటర్స్ లోకి తెచ్చిన పూరిని అందరూ మెచ్చుకుంటున్నారు.. అదే టైం లో ఇంత తక్కువ టైం లో సినిమాని ఎలా తీశాడో అంటూ డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే  బాలయ్యను పూరీ తన స్టైల్లో స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశాడనే అంచనాలు ఫ్యాన్స్ లో.... ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. 

అయితే పూరి ట్రాక్ రికార్డ్ ఈ మధ్యన అంతగా బాగోలేదు కూడా. వరుస ప్లాప్ లతో ఉన్న పూరికి ఈ సినిమా హిట్ కీలకం కానుంది. ఇప్పటికే స్టార్ హీరోలు చాలామంది పూరి నుండి తప్పించుకుతిరుగుతున్నారనే టాక్ వుంది. పూరితో సినిమా చేస్తే ఏమవుతుందో అనే అనుమానంలో వీరెవరూ పూరి ఛాయలకు కూడా వెళ్లడంలేదు. అందుకే పూరి ఈసారి ఈ 'పైసా వసూల్' విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించడం వంటి విషయాలతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయ్. ఇకపోతే ఈ మూవీని పూరి 'పోకిరి' తరహాలోనే తెరకెక్కించాడనే టాక్ మొదటినుండి ఉండనే వుంది.

'పోకిరి' లో మహేష్ ఉన్నట్టే బాలయ్య కూడా 'పైసా వసూల్' లో సరికొత్త జోష్‌లో ఉంటాడని.. స్టైల్, ఫైట్స్, సాంగ్స్‌కు థియేటర్స్‌లో ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ తో పాటే విజిల్స్ కూడా పడతాయంటున్నారు. ఫస్ట్ హాఫ్ జెట్ స్పీడ్‌లో ఉంటే.... ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిందని టాక్ వినబడుతుంది. అయితే సెకండ్ హాఫ్‌లో స్టోరీ కోసం కాస్త స్పీడ్ తగ్గినా.. ట్విస్ట్స్, యాక్షన్ పార్ట్, ఆలీ కామెడీ, బాలయ్య పాడిన పెగ్ సాంగ్, ఎన్టీఆర్ రీమిక్స్ సాంగ్ ఎంటర్‌టైన్ చేస్తాయని.. ఈ 2 గంటల 25 నిమిషాల పైసా వసూల్ సినిమా నిర్మాతలకు పైసా వసూళ్లే అంటున్నారు.. చూద్దాం నిర్మాతలకు 'పైసా వసూలా'? లేదా అనేది.

What in Balayya Paisa Vasool ? :

Paiisa Vasool First Half and Second Half Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ