సినిమా రంగంలో, రాజకీయ రంగంలో భజనపరులు, భట్రాజులు ఎక్కువ. తమకు కూడా ఏదైనా అవకాశం ఇస్తారని సినిమా రంగంలోని వారు రాజకీయ పక్షాల భజన చేస్తుంటారు. నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఎందరో అనామకులు ఎన్నికల్లో నిలబడి గెలిచి, మంత్రులుగా కూడా పనిచేశారు. నాడు ఆల్‌ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అధ్యక్షులైన నెల్లూరుకు చెందిన తాళ్లపాక రమేష్‌రెడ్డి, శ్రీపతి రాజేశ్వర్‌రావులు ఆ బాపతే.
ఇక చిరంజీవి పార్టీ పెట్టిన వెంటనే ఆయన కూడా ఎన్టీఆర్‌లాగా ప్రభంజనం సృష్టిస్తాడని ఫ్యాన్స్ సీట్లకోసం పోటీలు పడ్డారు. ఇక 2019 ఎన్నికలకు చాలా సమయం ఉండగానే ఇప్పుడే రాజకీయ వేడి రాజకుంది. వేషాలు తగ్గిన వేణుమాధవ్ నంద్యాలలో ప్రచారం చేసి, రోజాని, జగన్‌ని బట్టేబాజ్ అని తిట్టాడు. ఇక రోజా కూడా నోరు తెరిస్తే బూతులే. ఇక తాజాగా బ్రహ్మానందంకు కాస్త క్రేజ్ తగ్గడంతో పేరడీ పాత్రలు చేస్తున్నాడు 30 ఇయర్స్ పృథ్వీ. ఈయన మొదటి భార్యని తీవ్రంగా మోసం చేసి కేసులను ఎదుర్కొంటున్నాడు.
ఇక తానేదో సూపర్‌స్టార్ అయినట్లు ప్యాకేజీ కోసం అమ్ముడుపోతూ పార్టీని వీడి, ఇతర పార్టీలలో చేరుతున్న వైసీపీ వారిని ఏవేవో అనేశాడు. ప్రతి ఒక్కరికి పదవి అంటే ఎలా? పదవులకు అలవాటు పడి అవి రాకపోవడంతో నీతిమాలిన చర్యగా పార్టీలు మారుతున్నారు.. అంటూ తనదైన సినిమా స్టైల్‌లో అరిచేశాడు. ఆయన జగన్‌కి వకాల్తా ఎందుకు పుచ్చుకున్నాడు? అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన తీరు అలా ఉంది.
జగన్ నుంచి వేరుపడి టిడిపిలో చేరిన వారు, మౌనంగా రాజకీయాలలో స్తబ్దుగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. వీరు పదవులు లేవని పార్టీలు మారలేదు. జగన్ అధికారంలో లేకుండా పవర్‌ఫుల్ పదవులు ఎలా వస్తాయి? ఆయన అధికారంలో ఉండి తమకు మంత్రి పదవులో, నామినేటెడ్ పదవులో ఇవ్వలేదని పార్టీని అలిగితే సరే. కానీ పార్టీ పరంగా ఇచ్చే పదవులు మైసూరారెడ్డి, సబ్బంహరి, ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటి వారికి అవసరం లేదు. వారు తమతో జగన్ సరిగా ప్రవర్తించడం లేదని, రూమ్‌లో ఒకే ఒక్క కుర్చీ వేసి ఎంత సీనియర్‌నైనా నిలిచోబెట్టే మాట్లాడుతాడని, ఇతరులు సలహాలు ఇస్తున్నా పట్టించుకోడని ఆయనపై ఉన్న ఆరోపణలు.
చివరకు 30 ఇయర్స్ పృథ్వీని కూడా ఓ జూనియర్ నిల్చోబెట్టి, తాను మాత్రం ఒక్కడే కుర్చీ వేసుకుని మాట్లాడితే ఆ బాధ ఆయనకు తెలుస్తుంది. మేధావుల మౌనం, వారి సూచనలకు విలువ ఇవ్వడం అనేది ప్రతి ఎదిగే రాజకీయనాయకునికి అత్యంత అవసరం. అంతేగానీ పార్టీ మారిన వారందరూ ప్యాకేజీలకు, అధికారాల కోసం పార్టీ మారారని ఏకంగా అందరినీ ఉద్దేశించి, అందరినీ ఒకే గాటన కట్టడం 30ఇయర్స్ పృథ్వీ వంటి వారి అవగాహనారాహిత్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు.