Advertisementt

బాలయ్యని ఎలా సంతోషపెట్టాలో ఛార్మికే తెలుసు?

Mon 28th Aug 2017 09:01 PM
balakrishna,charmme,paisa vasool,charmee  బాలయ్యని ఎలా సంతోషపెట్టాలో ఛార్మికే తెలుసు?
Charmme Speech at Paisa Vasool Audio Success Meet బాలయ్యని ఎలా సంతోషపెట్టాలో ఛార్మికే తెలుసు?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - పూరి కాంబోలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం వచ్చే నెల 1 న విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా చిత్ర టీమ్ 'పైసా వసూల్' ఆడియో సక్సెస్ మీట్ ని భారీ లెవల్లో నిర్వహించింది. ఆడియో వేడుకని ఖమ్మంలో భారీగా నిర్వహించారు. అలాగే 'పైసా వసూల్' పాటలు యూట్యూబ్ లో వీడియో ప్రోమోలతో సహా ఆకట్టుకున్నాయి. 'పైసా వసూల్' పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సందర్భాల్లో చిత్ర టీమ్ ఈ ఆడియో సక్సెస్ మీట్ ని గొప్పగా నిర్వహించింది. అయితే ఈ వేడుకలో బాలయ్య బాబు ఫుల్ జోష్ లో కనిపించాడు.

సినిమాలో నటిస్తున్న శ్రియ, ముస్కాన్, కైరాలతోనే కాకుండా 'పైసా వసూల్' లైన్ ప్రొడ్యూసర్, పూరికి వ్యాపారవ్యవహారాలు చక్కబెడుతున్న ఛార్మి తో కూడా బాలకృష్ణ ఫుల్ జోష్ లో కబుర్లు చెబుతూ కనబడ్డాడు. వారితో సరదాగా అల్లరి చేస్తూ బాలయ్య ఎనర్జీతో రెచ్చిపోయాడు. కేవలం సినిమాలోనే కాక బయట ఈ ఈవెంట్ లో కూడా బాలయ్య జోష్ చూస్తుంటే సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోతూన్నాయి. అయితే ఈ ఈవెంట్ కి  మోహన్ బాబు అతిధిగా పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇకపోతే ఈ ఈవెంట్ కి హాజరైన అందరూ బాలయ్య, పూరీల కాంబోని పొగుడుతూ ఆకాశానికెత్తేశారు.

ఇక ఈ ఈవెంట్లో లో ఛార్మి హడావిడి అందరికన్నా ఎక్కువగానే కనబడింది..బాలకృష్ణ ని అందరు బాలయ్య బాబు అనో లేకుంటే బాలకృష్ణ అనో, బాలయ్య అనో, నందమూరి నటసింహం అనో పిలుస్తుంటారు. అయితే బాలకృష్ణకి బాలకృష్ణ గారు అనో  బాలయ్య గారు అనో పిలిస్తే అస్సలు ఇష్టం వుండదంట. అందరూ బాలా అని పిలిస్తే ఆయనకి చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారట. అందుకే ఇక్కడ 'పైసా వసూల్' ఫంక్షన్ లో సదరు హీరోయిన్ ఛార్మి గారు బాలయ్య మనసెరిగి బాలా... బాలా అంటూ తెగ వయ్యారాలు పోతూ మాట్లాడేసింది. ఇక బాలకృష్ణ - శ్రియ శరణ్ లు కెమెరా ముందే గాక బయట కూడా నిజమైన భార్య భర్తల్లాగా కనబడ్డారని చెప్పుకొచ్చింది. అంత ముచ్చటగా వాళ్ళ పెయిర్ ఉందని... చెప్పుకొచ్చింది.

అయితే ఛార్మి అలా బాలా అనిపిలుస్తుంటే అక్కడే ఉన్న బాలకృష్ణ ఆనందం చూడాలి...  పిచ్చ హ్యాపీగా కనబడ్డాడు. ఇక పక్కనే ఉన్న బాలయ్య అక్కడ వున్న ఛార్మిని దగ్గరకు తీసుకుని మరీ అభినందించడం ఈ వేదికపై హైలెట్ అయ్యింది. ఇక ఈ చిత్రం మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Charmme Speech at Paisa Vasool Audio Success Meet:

Charmme Reveals Secrets of Balayya at Paisa Vasool Audio Success Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ