రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారి మహేష్ తో జతకడుతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న 'స్పైడర్' మూవీ ప్రస్తుతం సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మరో వైపు షూటింగ్ అనంతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చాలా ఫాస్ట్ గా జరుపుకుంటుంది. దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 27 న విడుదల కానుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడొక స్టిల్ అందరినీ ఆకట్టుకుంటుంది. 'స్పైడర్' సాంగ్ కి చెందిన ఈ స్టిల్ లో మహేష్ మరియు రకుల్ ల అభినయం హాట్ టాపిక్ గా వుంది. ముఖ్యంగా మహేష్ ని కొరికేసే చూపులతో రకుల్ ఇచ్చిన అభినయం మాత్రం.. మాంచి కిక్ ఇస్తోంది.