ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో తెలియదు గాని ఆ సినిమాపై అప్పుడే ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి పవన్ ని డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకుండా షూటింగ్ చేస్తూనే వున్నాడు. మరోపక్క వచ్చే అక్టోబర్ కి సినిమా పూర్తి చేసి అలాగే సంక్రాంతి బరిలో సినిమాని విడుదల చేద్దామనుకుంటున్నారనే న్యూస్ వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుంది గాని... చిత్ర యూనిట్ నుండి ఎటువంటి సమాచారం అందడంలేదు.
ఇకపోతే త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమా గురించి అప్పుడే వేడి వేడి వార్తలు సామాజిక మాధ్యమాల్లో, ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసం అప్పుడే పవన్ సినిమాలో నటిస్తున్న అను ఇమ్మాన్యువల్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశాడని... అంతేకాకుండా ప్రస్తుతం పవన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్ నే మరోసారి ఎన్టీఆర్ సినిమా కోసం తీసుకుంటున్నాడే న్యూస్ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరి పవన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, త్రివిక్రమ్ సినిమాకి ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడో గాని.... వాటికి పడిపోయిన త్రివిక్రమ్ మళ్ళీ ఎన్టీఆర్ సినిమాకి ఛాన్స్ ఇచ్చాడంటున్నారు. అలాగే అను ఇమ్మాన్యువల్ కూడా పవన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. మరి ఆమె నటన మెచ్చిన త్రివిక్రమ్ మరోసారి ఎన్టీఆర్ మూవీ కి ఎంపిక చేయడం అనేది విశేషమే. ఇకపోతే ఎన్టీఆర్ డాన్స్ లకు అనిరుధ్ సంగీతం కూడా తోడైతే ఇక రచ్చ రచ్చే అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసేసుకుంటున్నారు.